ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్(పదవీ విరమణ వయస్సు)ను ఏడాది పాటు పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో...ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్... ప్రభుత్వ మరియు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగస్తులందరి పదవీవిరమణ వయస్సును ప్రస్తుత్తమున్న 58నుంచి 59ఏళ్లకు పొడిగించినట్లు పళనిస్వామి సర్కార్ తెలిపింది.
ఈ ఆర్డర్ వెంటనే అమల్లోకి వస్తుందని అన్నాడీఎంకే ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందన్న కారణాలను ప్రభుత్వం తెలుపలేదు. కాగా, రైటైర్డ్ అయిన ఉద్యోగులకు పీఎఫ్,గ్రాట్యూటీ వంటివి ఇతర పేమెంట్స్ ను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా భారీ ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మొత్తం భారాన్ని ఓ ఏడాది పాటు వాయిదావేయడంలో భాగంగానే ప్రభుత్వం ఏడాది సర్వీసును ఉద్యోగులకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

0 Comments:
Post a Comment