న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ అభ్యర్థుల నిరీక్షణకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ-మెయిన్స్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ల తేదీలను మే 5న ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్ విధించడంతో పలుమార్లు పరీక్ష నిర్వహణ వాయిదా పడుతూ వస్తున్నాయి. అసలు ప్రవేశ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో పరీక్ష నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని, పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
0 Comments:
Post a Comment