Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 27 May 2020

నేడు విద్యా వ్యవస్థ పై సీఎం సమీక్ష - ముఖ్య అంశాలు....ఈనాడు ,సాక్షి ,ఆంధ్రజ్యోతి పత్రికలలో వచ్చిన న్యూస్ ఒకే పేజీ లో..

విద్యార్థులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్: 7 కాదు 9 రకాల వసతులు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా 'మన పాలన - మీ సూచన' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ మూడో రోజులో భాగంగా.. సీఎం జగన్ విద్యారంగంపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా బోధన జరగాలి. పేదవాడు తన కాళ్లపై తాను నిలబడాలంటే వారికి చదువే ఆస్తి. పాఠశాలల బిల్డింగులు అధ్వాన్నంగా ఉండేవి.
హైయర్ ఎడ్యుకేషనల్‌లో మన పిల్లలు వెనుకబడి ఉన్నారు. పెద్ద విద్యార్థులతోనే వారి తలరాతలు మారుతాయి. తొలివిడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఒకటి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలవుతుంది. చదివించే స్థోమత లేకనే పిల్లలను తల్లిదండ్రులు కూలి పనులకు పంపుతున్నారు. 70 శాతం మంది పిల్లలు ఇంటర్‌తోనే చదువును ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లల చదువుల కోసం తల్లిండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. అప్పులు కూడా చేసి చదవిస్తున్నారు. ఇకపై అలాంటి కష్టం ఎవరికీ రాకూడదనే ఈ పథకాలను తీసుకొచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.


EENADU... NewS

ఉన్నత చదువులతోనే పేదరికం నుంచి విముక్తి
అమరావతి: ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రోజుకో అంశంపై మేధోమథనం నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్‌  బుధవారం విద్యారంగంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, చదువుల్లో మార్పు తీసుకురావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని వివరించారు. ఇంటర్‌ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే వారి సంఖ్య పెంచాలని సూచించారు. పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా సహకారం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే పేదరికం నుంచి వారి కుటుంబాలు బయటపడతాయన్నారు. రాష్ట్రంలో 45వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే సరైన సౌకర్యాలు లేవని, అందుకే ‘నాడు-నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశాం. పేరెంట్‌ కమిటీలను అడిగితే 95 శాతం మంది ఆంగ్ల మాధ్యమం మంచిదన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కుట్ర పన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమాన పరిచినట్లా?. పెద్ద పెద్దవాళ్లంతా తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు’’ అని జగన్‌ అన్నారు. అగస్టు 3న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని, అదే రోజు జగనన్న విద్యా కానుక అందిస్తామని తెలిపారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు.

Sakshi News


సాక్షి, తాడేపల్లి : అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు.. మన పిల్లల భవిష్యత్‌ కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లిషు మీడియం వద్దనే పెద్ద మనుషులు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘నా పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. పిల్లలకు నవంబర్‌ నాటికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి. స్కూల్‌ బిల్డింగ్‌లు అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి ఉన్న ఎవ్వరూ పట్టించుకోలేదు. స్కూళ్లల్లో బాత్‌రూమ్‌లు కూడా సరిగా లేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వృథా అనే పరిస్థితి ఉండేది. అందుకే ఖర్చు ఎక్కువైనా పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లల్లో చేర్పించేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతీది ఇంగ్లిష్‌ మీడియంలోనే ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై.. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. మన పిల్లల భవిష్యత్‌ కోసం ఇది నేను పెడుతున్న పెట్టుబడి.

సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం..
బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే కళాశాలల్లో చేరే విద్యార్థుల నిష్పత్తిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. చదివించే స్థోమత లేకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను ఆపేస్తున్నారు.. పాదయాత్రలో పిల్లలను చదివించలేక ఇబ్బందిపడుతున్న చాలా మంది తల్లిదండ్రులను కలిశా. చదువు కోసం తండ్రి అప్పులపాలు కాకూడదని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు గోపాల్‌ అనే వ్యక్తి పాదయాత్రలో నాతో చెప్పారు. పేదరిక నిర్మూలనకు ఉన్న ఏకైక పరిష్కారం చదువు మాత్రమే. అందుకే విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. విద్యారంగంలో మార్పుల్లో భాగంగానే ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చాం. ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లనే కొందరు పెద్ద మనుషులు విచిత్రమైన వాదనను తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దనే పెద్దమనుషులు మాత్రం...తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నారు. అసెంబ్లీలో చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. అయినా సడలని పట్టుదలతో ఇంగ్లిష్‌ మీడియంపై ఇంటింటి సర్వే చేశాం. దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటే.. అందులో 96శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం.

పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నాం. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలున్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నీచర్‌, టాయిలెట్లు ఉండాలి. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే అమ్మఒడి తీసుకొచ్చాం. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మఒడి ప్రారంభించాం. 43 లక్షల మంది తల్లులకు రూ.6350 కోట్లను నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశాం.

పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక..
ఏవైనా కొత్త మార్పులు చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇంగ్లిష్‌ మీడియానికి సంబంధించి కూడా చిన్న, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడే పరిస్థితి రావాలి. కోవిడ్‌ కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇస్తాం. జగనన్న విద్యాకానుకలో యూనిఫాం, బుక్స్‌, షూలు, బెల్ట్‌, బ్యాగ్‌ అందిస్తాం. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాం. సరుకుల బిల్లులతోపాటు ఆయాల జీతాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెనూ రూపొందించాం’ అని తెలిపారు.

చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం
ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ ఉండాలని నిర్ణయించాం. 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టింది. గత ప్రభుత్వ బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించిన... ఫీజురీయింబర్స్‌మెంట్‌ రూ.4200 కోట్లను ఇప్పటికే చెల్లించాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బులను.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తాం. హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు వసతి దీవెన కింద రెండు దఫాల్లో రూ.20వేలు ఇస్తాం. కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసి.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కోసం ఇద్దరు రిటైర్డ్‌ జడ్జిలను నియమించాం. పాఠశాలలు, కాలేజీలు తమ సదుపాయాలను వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉంటుంది’ అని తెలిపారు.

Andhra Jyothi News

అమరావతి : ‘విద్యారంగంపై ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు..? మన పిల్లల భవిష్యత్‌ కోసం నేను పెడుతున్న పెట్టుబడి ఇది’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేద విద్యార్థుల కోసం ‘జగనన్న గోరుముద్ద’ పథకం ప్రారంభించామని సీఎం స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యారంగంపై సీఎం జగన్‌ మేధోమథన సదస్సు నిర్వహించారు. ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేధోమథన సదస్సు జరుగుతోంది. ఏడాదిలో విద్యాశాఖలో చేసిన కార్యక్రమాల తీరు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
చదువే వారికి ఆస్తి..

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇంగ్లీషు మీడియం వద్దని చెప్పేవారు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారు? అని ప్రశ్నించారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం విద్యాబోధన ఉండాలన్నారు. ‘పేదవాళ్లు తమ కాళ్లపై తాము నిలబడాలంటే చదువే ఆస్తి. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలి. ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరగాలి. చాలా మంది తమ పిల్లలను చదివించే స్థోమత లేక మధ్యలోనే ఆపించేస్తున్నారు. విద్యారంగంలో మార్పుల్లో భాగంగా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం బిల్లులను ప్రతిపక్షాలు ఆలస్యం చేయగలిగారు కానీ.. ఆపలేకపోయారు. ఇంగ్లిష్ మీడియంను తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లు అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఇంగ్లిష్ మీడియంను తీసుకురావాలని ఉక్కు సంకల్పంతో అడుగులు వేశాం. ఇంగ్లిష్ మీడియం కావాలని 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్నాం’ అని సీఎం జగన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top