విశాఖ: ప్రస్తుతం విశాఖలోని గోపాలపట్నంలో మనిషిని ఉక్కిబిక్కిరి చేస్తున్న విషవాయువు 'స్టిరిన్'. బుధవారం తెల్లవారుజామున ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో 'స్టిరిన్' అనే గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఆ గాలిని పీల్చిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందగా, దాదాపు 200 తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న 'స్టిరిన్'ను ఎందుకు వాడతారు?ఆ గ్యాస్ ప్రజలపై అది ఏవిధంగా ప్రభావం చూపిస్తుంది..!!
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్.ఆర్.వెంకటాపురంలో 1997లో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీని నెలకొల్పారు. దాదాపు 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీలో రోజూ 417 టన్నుల పాలిస్టిరిన్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే స్టైరిన్ అనే గ్యాస్‌ను ముడిసరకుగా పాలిస్టిరిన్‌ను తయారు చేస్తారు. తాజాగా పాలిమర్స్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో స్టిరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాలి. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందించాలి. గతంలో కూడా ఎల్‌జి పాలిమర్స్‌లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ అప్రమత్తం కావడంతో అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని అరికట్టింది.
''లాక్‌డౌన్ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులు జరగకపోవడంతో స్టైరిన్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిగిలిన గ్యాస్ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు. ఈ ప్రమాదం జరిగిన చోట 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొంతవరకూ అస్వస్థతకు గురి అవుతారు. అయితే ఈ గ్యాస్ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. స్టైరిన్ గ్యాస్‌ను పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గ్యాస్‌ను కనుక అధిక మోతాదులో పీలిస్తే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది'' -ఐ.ఐ.పి.ఈ డైరెక్టర్ ప్రసాద్

0 Comments:
Post a Comment