కరోనా వైరస్ వ్యాప్తికి ఏటీఎం నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా గుజరాత్, మహారాష్ట్రల్లో ఇలాంటి ఘటనలే ముందుకు వచ్చాయి. కరోనా వైరస్ బారిన పడిన ఎవరైనా వ్యక్తి, తెలియకుండా ఏటీఎం సెంటర్లోకి వచ్చి ఉంటే.. ఆ వైరస్ మ వ్యాపించే అవకాశం లేకపోలేదు. వైరస్ బారిన పడిన వ్యక్తి ఏటీఎం మిషన్ ముట్టుకోవడంతో పాటు ఆ సెంటర్‌లో ఏ వస్తువును తాకిన వైరస్ దానికి అంటుకునే అవకాశం ఉంటుంది. తెలియక చేసిన పనికి, వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. అతను వెళ్లిపోయిన తరువాత డబ్బులు తీసుకోవడానికి వెళ్లే వారు వైరస్ బారిన పడే అవకాశం ఉంది.
ఏటీఎం సెంటర్‌లలో ఏ మాత్రం అలసత్వం వహించిన వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లే వారు ఖచ్చితంగా పలు జాగ్రత్తలు పాటించాల్సిందే.
లేకపోతే, వైరస్ అంటక మానదు. నగదు విత్ డ్రాకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లే ముందు ఖచ్చితంగా సానిటైజర్‌ను రాసుకోవడమే కాక, మోహానికి మాస్క్‌ను ధరించాలి. క్యూ లైన్ ఉంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేయాలి. చేతులకు గ్లౌజ్‌లు వేసుకొని, తరువాత తీసేయడం ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. కరోనా వ్యాప్తికి ఏటీఎంలు ప్రధాన కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బ్యాంకులు కొత్త నిబంధన తీసుకొచ్చాయి. ఏటీఎం కేంద్రాలను శానిటైజ్ చేయాలని రూల్ పెట్టారు. ఆ విధంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నాయి.
కరోనా వ్యాప్తి కట్టడికి బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఏటీఎంల విషయంలో. కరోనా నేపథ్యంలో ఏటీఎంను వినియోగించిన ప్రతిసారి శుభ్రం చేయాలి. హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని ఏటీఎంలను స్థానిక మున్సిపల్ సిబ్బంది రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించని ఏటీఎం కేంద్రాలను మూసివేస్తారు.
0 Comments:
Post a Comment