Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 24 May 2020

AP - ఏపీ బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటి నుంచే ఎగ్జామ్స్

Knit and IITs to avoid academic year loss due to corona .. Online exams are conducted by BITEC Final Year Students.  Students at home with lockdown arrange to write exams from there.  If there is a delay in conducting the exams, placements will be awarded ..  Against this backdrop, IIT Tirupati and Tadeepalligudem Knit special software were created for online exams.

కరోనా కారణంగా అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు నిట్‌, ఐఐటీలు.. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇళ్ల వద్దనున్న స్టూడెంట్స్ అక్కడి నుంచే ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో ఆలస్యం జరిగితే ప్లేస్మెంట్స్ పొందినవారు.. ఉన్నత చదువులకు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కు ఐఐటీ తిరుపతి, తాడేపల్లిగూడెం నిట్ స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.
తాడేపల్లిగూడెం నిట్..ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించనుంది. కాలేజీల్లో నిర్వహించిన మిడ్‌, మైనర్ ఎగ్జామ్స్ కు 75% వెయిటేజ్‌ ఇస్తారు.
మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు. దీనిలో జంబ్లింగ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థి తన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే క్వచ్చన్ పేపర్ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ కెమెరా స్టూడెంట్ ను పరిశీలిస్తూ ఉంటుందని అకడమిక్‌ డీన్‌ బీఆర్‌కే శాస్త్రి తెలిపారు. రెండు, మూడో సంవత్సరం స్టూడెంట్స్ కు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఐఐటీ తిరుపతిలో క్వచ్చన్స్, ఆన్సర్స్ రూపంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇవి జూన్ ఫస్ట్ వీక్ లో ప్రారంభం కానున్నాయి. కరోనావైరస్ నేపథ్యంలో.. స్టూడెంట్స్ ఒకచోటకు వచ్చి ఎగ్జామ్స్ రాసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐఐటీ తిరుపతి సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. ఫైనల్ ఇయర్ సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులకు ఉత్తీర్ణత, అనుత్తీర్ణత అని మాత్రమే ఇస్తారు. గ్రేడ్లు కేటాయించరు. స్టూడెంట్స్ జవాబులను కంప్యూటర్‌పై టైప్‌ చేయాల్సి వస్తున్నందున కొంచెం ఎక్కువ సమయం ఇవ్వనున్నారు. విద్యార్థుల కదలికలను కంప్యూటర్‌లోని కెమెరా ద్వారా ర్ చేస్తారు

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top