మద్యపాన నిషేధం దిశగా ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్నే మద్యం ధరలను 25 శాతం పెంచిన జగన్ సర్కారు.. మరో 50 శాతం ధరలను పెంచేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించడంతో వైన్ షాపులు నిన్న ప్రారంభమయ్యాయి. తొలి రోజే మందుబాబులు వైన్ షాపుల దగ్గర క్యూ కట్టారు. 40 రోజుల తర్వాత మద్యం షాపులు తెరచుకోవడంతో... మద్యపాన ప్రియులు ఎగబడ్డారు. అన్ని మద్యం షాపులూ కళకళలాడాయి. ప్రతి చోటా పొడవాటి క్యూలు కనిపించాయి. ఫలితంగా సోమవారం ఒక్క రోజే మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.40 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులను తెరిచారు. షాపులు తెరవక ముందే అక్కడ క్యూ కట్టిన లిక్కర్ లవర్స్...
నిన్న ఒక్క రోజే... లక్షల మంది మద్యం కొనుక్కున్నారు. కొంతమందైతే... కేసులకు కేసుల బాటిళ్లు పట్టుకుపోయారు. చాలా మంది ఒకే రకం కాకుండా... మూడు నాలుగు రకాల బ్రాండ్లను కొనుక్కున్నారు. ఏపీలో అధికారికంగా మొత్తం 3,468 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో 2,345 మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని అమ్మారు.
అయితే, మద్యపానం నిషేధం కోసం మద్యం రేట్లను పెంచినా.. మందు బాబులు భారీగా లిక్కర్‌ను కొనుగోలు చేశారు. దీంతో నిన్నటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం ధరలను భారీగా పెంచేసింది. మొత్తంగా 75శాతం మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికిప్పుడే పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గించాలని ప్రభుత్వం సంకల్పించింది.

0 Comments:
Post a Comment