అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించాలనే హైకోర్టు ఆదేశాల తర్వాత మట్టి రంగు చేరుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో మరోసారి పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు చేసింది. కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైకాపా పార్టీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని, వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రంగుల వివాదం కొనసాగుతూనే ఉంది.
0 Comments:
Post a Comment