రుణాలపై మరో 3 నెలల మారటోరియం!
ఆర్బీఐ పరిశీలనలో ప్రతిపాదన
దిల్లీ: బ్యాంకు రుణాలపై మరో మూడు నెలల పాటు మారటోరియం విధించే ప్రతిపాదనను ప్రస్తుతం ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ని ఈ నెల 17 వరకు పొడిగించడం, కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు, పరిశ్రమకు చేయూత ఇచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. భారతీయ బ్యాంకుల సంఘం సహా వివిధ వర్గాల నుంచి మారటోరియం పొడిగింపునకు ప్రతిపాదనలు వచ్చాయని, ఆర్బీఐ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత మారటోరియం గడువు ఈ నెల 31తో ముగియనుంది. కొన్నిరోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా వ్యక్తుల, సంస్థల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణాలపై మరో మూడు నెలలపాటు మారటోరియం విధించడం అనేది ఆచరణాత్మక మార్గమని ప్రభుత్వ రంగ బ్యాంక్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు.

0 Comments:
Post a Comment