పెరుగుతున్న సాంకేతికత దేనికి సంకేతం?
(తేది:11/5/2020 జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా)
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పరిశీలన, ప్రయోగం తదితర అంశాల ఆధారంగా సైన్స్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, సైన్స్ అనువర్తనాల ఆధారంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. సైన్స్ సిద్ధాంతాలు, సూత్రాలతో ముడిపడి ఉంటుంది. టెక్నాలజీ నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తుంది. న్యూటన్ ప్రతిపాదించిన 3వ గమన నియమం సైన్స్ పరిధిలోకి వస్తే, ఆ నియమం ఆధారంగా అంతరిక్షంలోకి పంపించబడుతున్న కృత్రిమ ఉపగ్రహాలు టెక్నాలజీ కోవలోకి వస్తాయి. నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1998లో జాతీయ సాంకేతిక దినోత్సవం జరపాలని నిర్ణయించింది. 1998 మే 11, 13 తేదీల్లో భారతదేశం రెండోసారి అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే11న ''నేషనల్ టెక్నాలజీ డే'' జరుపుతున్నారు. మన దేశంలో సాంకేతిక నిపుణులకు, శాస్త్రవేత్తలకు కొదవలేదు. చంద్రయాన్-1, మంగళయాన్, ఆపరేషన్ శక్తి, చంద్రయాన్-2 తదితర ప్రయోగాల ద్వారా అంతరిక్ష పరిశోధన రంగంలో మన దేశం ఇతర అగ్ర దేశాల సరసన చేరింది. రక్షణరంగంలో అగ్ని, బ్రహ్మోస్ వంటి క్షిపణులు రూపొందించుకొని స్వయం ప్రతిపత్తి సాధించాం. ఇస్రో ద్వారా అనేక ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించగలుగుతున్నాం. అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించగలిగాం. ''పరమ్'' పేరుతో సూపర్ కంప్యూటర్‌ని రూపొందించగలిగాం. సైన్స్ అందిస్తున్న ఈ సాంకేతిక విజ్ఞానం ఆధునిక సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. అదే సమయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మానవాళి ముందు అనేక సవాళ్లనూ ఉంచుతున్నది. వైద్యరంగంలో యాంటీ బయాటిక్స్, వ్యవసాయ రంగంలో ఫెస్టిసైడ్స్, రక్షణ రంగంలో వెపన్స్ మానవాళికే కాకుండా భూమిపై ఉన్న సకల జీవరాశుల ఉనికికి పెను ప్రమాదంగా మారాయి. 18వ శతాబ్ధంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఆశించిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇవ్వలేకపోయినప్పటికీ, అంతులేని కాలుష్యాన్ని మాత్రం ఇవ్వగలిగింది. ఒకప్పుడు హరిత విప్లవం వలన ఉపయోగాలను మాత్రమే చదువుకున్నాం. ఇప్పుడు రసాయనిక ఎరువుల వినియోగం వలన వచ్చే నష్టాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సైన్స్ ద్వారా మశూచి వంటి భయంకర వ్యాధులను నిర్మూలించగలిగినప్పటికీ, తట్టువంటి వ్యాధులు తిరిగి విజృంభిస్తున్నాయి. మధ్యయుగంలో మతాన్ని రాజులు, భూస్వాములు, మతాధికారులు తమ గుప్పిట్లో ఉంచుకోగా, ఆధునిక కాలంలో సైన్స్ పరిశోధనలు, వాటి ఫలాలని కార్పొరేట్‌లు, బడా పారిశ్రామికవేత్తలు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో పేద, ధనిక వర్గాల మధ్య మరింత వ్యత్యాసం పెరిగిందే తప్ప, తగ్గలేదు. ప్రస్తుతం పరిశోధనలు ఎక్కువగా రక్షణ, అంతరిక్ష, విమానయాన రంగాలలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎక్కువ నిధులను వాటికే కేటాయిస్తు న్నాయి. సైన్స్ & టెక్నాలజీ రంగాల్లో జరిగే పరిశోధనలు సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలి. ఉగ్రవాదులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఇటీ వల న్యూజిలాండ్‌లో మసీదులపై, శ్రీలంకలో చర్చిలపై జరిగిన దాడుల్లో అమాయక ప్రజలే బలయ్యారు. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది. అయితే శృతిమించి కృత్రిమ మేధస్సు పై ఆధారపడితే మానవుడిలోని సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. హ్యాకింగ్‌కు కూడా అవకాశం ఏర్పడుతుంది. కంప్యూటరీకరణ వలన పేపర్ వినియోగం తగ్గినప్పటికీ, ఈ వేస్ట్ రూపంలో కాలుష్యం ప్రకృతిని కాటేస్తుంది. డైనమేట్, డిటోనేటర్ వంటి వాటిని కనుగొని కోట్లాది రూపాయలు సంపాదించిన ఆల్‌ఫ్రెడ్‌నోబెల్ తమ ఆస్తిని తమ పేరిట పురస్కారాలు ఇవ్వటానికి వీలుగా వీలునామా రాశాడు. మానవాళికి ఉపకారం చేసే గొప్ప ఆవిష్కరణలు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వాలని ఆయన సూచించాడు. నోబెల్ సూచించిన మార్గం నేటి పాలకులకు ఆదర్శం కావాలి. సైన్స్ పరిశోధనలు మానవ వికాసానికి దోహదపడాలే తప్ప, మానవ నాశనానికి కాదు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గాయి. సెల్ ఫోన్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రంగాలలో ఆన్లైన్ కార్యక్రమాలకు ప్రాముఖ్యత పెరిగింది. ఆయా రకాల యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా నియంత్రణకు కూడా ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. రోబోటిక్స్, నానో టెక్నాలజీ రంగాలకు ఆదరణ లభిస్తోంది. ఇదే సమయంలో వ్యక్తిగత సమాచారం చోరికి గురౌతుంది. ఆన్లైన్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కాలుష్యం పెరిగి మనిషి ప్రకృతికి దూరం అవుతున్నాడు.
- యం. రాంప్రదీప్
సెల్ : 9492712836

0 Comments:
Post a Comment