వాట్సప్ యూజర్లకు శుభవార్త. యూజర్లకు లోన్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది వాట్సప్. భారతదేశంలో పేమెంట్స్ సర్వీస్ ప్రారభించేందుకు వాట్సప్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా భారత ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ఈ అనుమతులు వచ్చిన తర్వాత మీరు వాట్సప్ నుంచే పేమెంట్స్ చేయొచ్చు. ఈ పేమెంట్ సిస్టమ్ విజయవంతం అయిన తర్వాత లోన్ మార్కెట్‌లో కూడా అడుగుపెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది వాట్సప్. ఇండియాలో యాప్స్ ద్వారా లోన్స్ ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి. షావోమీ ఎంఐ క్రెడిట్, రియల్‌మీ పేసా లాంటి యాప్స్‌లో లోన్స్ తీసుకోవచ్చు. అలాగే వాట్సప్ కూడా లెండింగ్ సర్వీసెస్‌ని ప్రారంభించే ఆలోచనలో ఉంది.
కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తమ బిజినెస్ వివరాలను వెల్లడించింది వాట్సప్. పేమెంట్స్‌తో పాటు క్రెడిట్ సేవల్ని కూడా అందిస్తామని తెలిపింది. వాట్సప్ బిజినెస్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడితే ఇక వినియోగదారులు వాట్సప్ నుంచే పర్సనల్ లోన్లు తీసుకోవచ్చు. ఇక ఇప్పటికే తమ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ లోకల్ డేటా ప్రొటెక్షన్ అండ్ స్టోరేజ్ రెగ్యులేషన్స్‌కు తగ్గట్టుగానే పనిచేస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వెల్లడించింది వాట్సప్. మే నాటికి ఈ వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చింది. వాస్తవానికి వాట్సప్ పేమెంట్స్‌కు ఫిబ్రవరిలోనే ఆమోద ముద్ర వేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI. కానీ ప్రైవసీ ఆందోళనలు వ్యక్తం కావడంతో అనుమతుల్ని వెనక్కి తీసుకుంది.
ఇండియన్ క్రెడిట్ మార్కెట్లోకి అనేక కంపెనీలు పోటాపోటీగా అడుగుపెడుతున్నాయి. షావోమీ ఎంఐ క్రెడిట్, రియల్‌మీ పేసా ఇప్పటికే రుణాలు ఇస్తున్నాయి. మరోవైపు అమెజాన్ కూడా పే లేటర్ పేరుతో వడ్డీలేని రుణాలు ఇస్తోంది. ఇందుకోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్. కస్టమర్లు రూ.15,000 వరకు లోన్ తీసుకోవచ్చు. 45 రోజుల్లో చెల్లించొచ్చు. అమెజాన్ లాగానే ఫ్లిప్‌కార్ట్ కూడా రుణాలను అందిస్తోంది.
0 Comments:
Post a Comment