హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని అందులో పేర్కొంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..ఆదివారం కూడా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొని ఇళ్లకే పరిమితం కావాలని సీఎం సూచించారు.
0 Comments:
Post a Comment