Shankarambadi Sundarachari (10 August 1914 – 8 April 1977)
సుందర కవిని స్మరిద్దాం
***
(ఏప్రిల్ 8న, సుందరాచారి వర్ధంతి సందర్భంగా)
“మా తెలుగుతల్లికి మల్లెపూదండ" గీతం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగీతంగా ఉండేది. తెలంగాణా రాష్ట్ర అవతరణ అనంతరం ఈ గీతం నవ్యాంధ్రకు మాత్రమే పరిమితమయ్యింది. 'వందేమాతరం' తదితర గీతాలన్నీ మన దేశ ఔన్నత్యాన్ని వర్ణించగా , 'మా తెలుగుతల్లి' గీతం మన రాష్ట్రం యొక్క భౌగోళిక స్థితిగతుల్ని అద్భుతంగా వర్ణిస్తుంది. పాఠశాలల్లో పిల్లలు ఈ గీతాన్ని రాగయుక్తంగా పాడుతుంటే మన హృదయం పులకించి పోతుంది. విద్య కార్పోరేటీకరణ అయిన తర్వాత ఈ గీతం తన ఉనికిని కోల్పోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఈ గీతం క్రమంతప్పకుండా ఆలపించబడుతుంది. అమ్మభాషకి ఆదరణ తగ్గుతున్న ఈ తరుణంలో రాష్ట్రగీతానికి, గీత రచయిత అయిన సుందరాచారికి మరోసారి పూర్వవైభవం తీసుకురావాల్సి ఉంది. శంకరంబాడి సుందరాచారి 1910 ఆగష్టు 10న జన్మించారు. చిన్నతనంనుండే ఆయన స్వతంత్ర భావాలు కల్గి ఉండేవారు. సనాతన సంప్రదాయాలని ఖండించారు. మదనపల్లెలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. భుక్తి కొరకు ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఆంధ్రపత్రికలో కొంత కాలం పాటు ఉద్యోగం చేశారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా సేవలందించారు. సుందరాచారి గొప్పకవి. ఆయన తేటగీతిలో ఎన్నో పద్యాలు రాశారు. మన రాష్ట్రగీతమైన “మా తెలుగుతల్లికి" కూడా తేటగీతిలో రాసిందే. రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. 'మా తెలుగుతల్లి' గీతాన్ని అల్లుడొచ్చాడు, బుల్లెట్, లీడర్ వంటి చలన చిత్రాల్లో కూడా ఉపయోగించుకున్నారు. తెలుగు వారికి ఒక స్వరాష్ట్ర ఆవశ్యకతను ఈ గీతం తెలియచేస్తుంది. స్వాతంత్రోద్యమ కాలం నుండే మద్రాసు నుండి తెలుగు వారు విడిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పాటుచేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. 'మా తెలుగుతల్లి' గీతం తెలుగు వారికి కూడా ఒక ఘనమైన చరిత్ర వున్నదని చాటిచెప్తుంది. బలిదానం, సుందర భారతం, సుందర రామాయణం, జపమాల , బుద్దగీతి, కెరటాలు వంటి రచనలు చేశారు. పలు జానపద గీతాలు రాశారు. సుందరాచారి 'మా తెలుగుతల్లికీ' గీతాన్ని 1942లో 'దీన బంధు' సినిమా కోసం రచించారు. కానీ ఆ చిత్ర నిర్మాతకు ఈ గీతం నచ్చక ఆ సినిమాలో పెట్టలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం ఈ పాటని మధురంగా పాడిన తర్వాతే ఈ గీతానికి గుర్తింపు లభించింది. సుందరాచారిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 'ప్రసన్న కవి' అని గౌరవించింది. ఆయనని భావకవి, సుందరకవి అని కూడా పిలుస్తారు. 1975లో హైద్రాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో 'మా తెలుగుతల్లికి' గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. 1977 ఏప్రిల్ 8న సుందరాచారీ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. యునెస్కో 2019ని ఆదిమ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా, ప్రాంతీయ భాషల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించింది. ఈ భూమ్మీద సజీవంగా ఉన్న 7000 భాషల్లో ఎక్కువగా లిపిలేని గిరిజన భాషలు, ప్రాంతీయ భాషలు అంతరించిపోతున్నాయి. చాలా ప్రాంతీయ భాషలకు జాతీయ, అంతర్జాతీయ హోదా లేదా బోధనా మాధ్యమాలుగా ఉండే అవకాశం లభించక పోవడం వల్ల క్రమేణా క్షీణించిపోతున్నాయి. తెలుగు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయడం ద్వారా, సాహిత్య అకాడెమీకి అత్యధిక నిధులని కేటాయించడం, తెలుగుభాషని ప్రాధమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా అమలు చేయడం, కనీసం రెండు సంవత్సరాలకొకసారి ప్రపంచ తెలుగు మహాసభలని నిర్వహించి కవులని సన్మానించడం ద్వారా తెలుగు భాషకి మరింత గౌరవాన్ని ఇవ్వవచ్చు. లేదంటే భాషతో పాటు గీతాలు కూడా కనుమరుగౌతాయి.

యం.రాంప్రదీప్,
తిరువూరు,
9492712836

0 Comments:
Post a Comment