చిన్న మొత్తాల పొదుపు పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ పొదుపు పథకం అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF సబ్ పోస్ట్ ఆఫీసుల్లో కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంది ఇండియా పోస్ట్. పీపీఎఫ్ స్కీమ్‌ను సింగిల్ హ్యాండెడ్ సబ్ పోస్ట్ ఆఫీసులకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఎలాంటి మోసాలు జరగకుండా సంబంధిత సబ్ పోస్ట్ ఆఫీసుల్లో కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ వచ్చే స్కీమ్ పీపీఎఫ్. ప్రస్తుతం వార్షికంగా 7.1 శాతం వడ్డీ వస్తుంది.
ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, సుకన్య సమృద్ధి యోజన-SSY లాంటి ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ రూల్స్‌ని సరళతరం చేసింది కేంద్ర ప్రభుత్వం.
అకౌంట్ హోల్డర్లు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిపాజిట్లను 2020 జూన్ 30 లోగా జమ చేయొచ్చని ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా 2019-20 డిపాజిట్లు చేయలేకపోయినవారికి ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, సుకన్య సమృద్ధి యోజన-SSY ఖాతాదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎప్పట్లాగే డిపాజిట్లు చేయొచ్చు. అయితే ఖాతాదారులు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరుగా డిపాజిట్లు చేయాలి

0 Comments:
Post a Comment