రిలయన్స్ జియో, ఫేస్ బుక్ మధ్య అనూహ్యమైన, అద్భుతమైన డీల్ కుదిరింది. రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. చరిత్రాత్మకమైన ఈ డీల్ విలువ సుమారు రూ.43,574 కోట్లు. దీని వల్ల రెండు కంపెనీలు, షేర్ హోల్డర్లు, వినియోగదారులు, పరిశ్రమకు ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దాం. మొదటగా భారత వినియోగదారులకు ఎలాంటి లాభం జరుగుతుందో తెలుసుకుందాం. ఒకే డిజిటల్ ప్లాట్ ఫాం అనేది కస్టమర్ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానంగా మారితే ఎలా ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. వినియోగదారులకు జరిగే లాభాల్లో కొన్ని చూద్దాం.
కాలింగ్, మెసేజింగ్, డాక్యుమెంట్ షేరింగ్
సినిమాలు, ఐపీఎల్‌కు టికెట్లు బుకింగ్మీ దగ్గర్లోని ఔట్‌లెట్లలో నిత్యావసర సరుకులు, బూట్లు, దుస్తులు, బంగారు ఆభరణాలు కొనొచ్చు
వీడియో క్రియేటింగ్, ఎడిటింగ్
గేమ్స్ ఆడుకోవచ్చు
చెల్లింపులు చేయవచ్చు, మనీ ట్రాన్స్‌ఫర్న్యూస్ తెలుసుకోవచ్చు
వ్యాపారాలు చేసే వారికి రుణాలు దొరుకుతాయి
రిటర్న్‌లు, జీఎస్టీలు ఫైల్ చేయవచ్చు
వ్యాపారానికి సాంకేతిక సాయం పొందవచ్చు
ఫేస్‌బుక్‌కు జరిగే లాభం ఏంటి?
ఫేస్‌బుక్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటి (200 మిలియన్ యూజర్లు), అలాగే వాట్సాప్ (400 మిలియన్ యూజర్లు) కూడా. ఇన్‌స్టా గ్రామ్‌కు అతిపెద్ద రెండో మార్కెట్ (80 మిలియన్ యూజర్లు). ఇప్పుడు జియోకు ఉన్న 400 మిలియన్ సబ్‌స్క్రైబర్ల బేస్‌ను తమ కస్టమర్లు, వ్యాపారులు, యువతకు దగ్గరయ్యేందుకు వినియోగించవచ్చు. ఒకసారి ఫేస్ బుక్ తన చిన్న వీడియోల ప్లాట్ ఫాం లాసోను జియో ప్లాట్ ఫాం మీద లాంచ్ చేసిందంటే అది టిక్ టాక్ కంటే పెద్దగా మారుతుంది. టిక్ టాక్ కు భారత్‌లో 200 మిలియన్ యూజర్లు ఉన్నారు.
జియో ఫేస్ బుక్ డీల్ సెట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2019 ఆగస్ట్‌లోనే ప్రణాళికలు రచించారు. 2019 ఆగస్ట్ 12న నిర్వహించిన 42వ వార్షిక జనరల్ మీటింగ్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ 2021 మార్చి 31 నాటికి అప్పులు లేని సంస్థగా మార్చాలని నిర్ణయించారు. ఆ రోడ్ మ్యాప్‌లో భాగంగానే జియోలో వాటాలను విక్రయించారు. రిలయన్స్ మరోవైపు ఆయిల్ - కెమికల్ విభాగంలో 20 శాతం వాటా విక్రయించేందుకు సౌదీ ఆరామ్కో సంస్థతో కూడా చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రిలయన్స్ జియో - ఫేస్ బుక్ డీల్ అనేది వారికి ఊపిరి తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 22న స్టాక్ మార్కెట్ ఎర్లీ ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 8 శాతం వృద్ధి నమోదైంది. ఈ డీల్ తర్వాత జియో ఐపీఓకి వస్తే షేర్ హోల్డర్లు కూడా లబ్ది పొందుతారు.
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో జరిగిన ఈ డీల్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా బలంగానే ఉందనే సంకేతం వెళ్తుంది. 5.7 బిలియన్ డాలర్లు డొమెస్టిక్ మార్కెట్లకు లబ్ధిని చేకూరుస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందంటూ, జీడీపీ అంచనాలను సవరించుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డీల్ సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తుంది.

0 Comments:
Post a Comment