కరోనా వైరస్, లాక్‌డాన్ ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది... ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్.. రెపో రేటు యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు.. అయితే, రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి అంటే.. 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఇక, రాష్ట్రాలకు 60శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు. సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు చేస్తామన్నారు. లాక్‌డౌన్ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశామని తెలిపిన ఆర్బీఐ గవర్నర్.. చిన్నతరహా పరిశ్రమలకు రూ.50 వేల కోట్లు.. నాబార్డుకు రూ.25 వేల కోట్లు, జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు ఇచ్చామన్నారు.
మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదని స్పష్టం చేశారు.
ఆర్బీఐ ప్రకటించిన కీలక నిర్ణయాలు:
- రివర్స్ రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు.. 4 శాతం నుంచి 3.75 శాతానికి రివర్స్ రెపోరేటు తగ్గింపు- రెపో రేటు యథాతథం
- రాష్ట్రాలకు 60శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు. సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు
- జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు
- నాబార్డుకు రూ.25వేల కోట్లు
- చిన్నతరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు
- మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదు.
- విపణిలో ద్రవ్య లభ్యతను అందుబాటులో ఉంచేందుకు చర్యలు
- రుణ లభ్యతను వీలైనంత ఎక్కువగా ఉంచేందుకు చర్యలు
- ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు
0 Comments:
Post a Comment