ఉపాధ్యాయుడు అంటే సమాజం ఎందుకంత గౌరవం ఇస్తుందో తెలపడానికి ఒక మంచి ఉదాహరణ ..మన ఉపాధ్యాయులు అయినటువంటి పొట్నూరు మురళీ మోహన్ రావు గారి విజయ గాధ ..🙏🙏
🌺 ఈయన ప్రస్తుతంజడ్పీ బాయ్స్ చిట్టివలస హైస్కూల్లో (, భీమునిపట్నం, మండలం,విశాఖపట్నం)గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు .
🌺.ఇతను ఉత్తమ ఉపాధ్యాయుడుగా కాకుండా విశాఖపట్టణం ఉపాధ్యాయ కుటుంబానికి సుపరిచిత వ్యక్తి ...
🌺ఆయన చదువుకున్నప్పుడు ఆయన పడిన కష్టాలు విద్యార్థులు పడకూడదని విద్యార్థులకు వనరులను సమకూరుస్తూ దృఢ చిత్తంతో, సేవాతత్పరతతో విధులు నిర్వహిస్తున్నారు..
🌺.ఇతను ఉత్తమ ఉపాధ్యాయుడుగా కాకుండా విశాఖపట్టణం ఉపాధ్యాయ కుటుంబానికి సుపరిచిత వ్యక్తి ...
🌺ఆయన చదువుకున్నప్పుడు ఆయన పడిన కష్టాలు విద్యార్థులు పడకూడదని విద్యార్థులకు వనరులను సమకూరుస్తూ దృఢ చిత్తంతో, సేవాతత్పరతతో విధులు నిర్వహిస్తున్నారు..
🌺ఉపాధ్యాయునిగా అతను చేసిన సేవలు;
🌺మొదటిగా అతను ఉపాధ్యాయ వృత్తి 1982లో బుచ్చయ్యపేట మండలం , మల్లం ప్రాథమిక పాఠశాల లో ప్రారంభమైంది..అప్పటి వరకు 14 మంది విద్యార్థులు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలను 92 మంది విద్యార్థులు పెరిగేటట్లు అతను అమలు చేసిన పక్కా ప్రణాళిలే కారణం..ఉపాధ్యాయ సమావేశాలు స్కూల్ లోనే కాకుండాస్కూల్ అనంతరంఊరు పెద్దలతో మాట్లాడే స్కూల్ అభివృద్ధికి వారిని భాగం చేయడం ద్వారా స్కూల్ అభివృద్ధికి దోహదపడే టట్టు చేశారు..
🌺 ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా తమ పాఠశాల ఉత్తీర్ణత శాతం పెరగడంలో,ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సాధించడంలో.. ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలు సాధించడంలోభాగంగా వార్షిక ప్రణాళికను ముందే తయారు చేసుకుంటారు.
🌺ఆర్ఎస్ఎస్ సభ్యులుగా సామాజిక సేవా కార్యక్రమాల్లోప్రత్యక్షంగా పాల్గొంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలకు( టీచర్స్ హెల్ప్ గ్రూపు) విజయవంతమైన సూచనలు అందిస్తారు..
🌺ఆర్ఎస్ఎస్ సభ్యులుగా సామాజిక సేవా కార్యక్రమాల్లోప్రత్యక్షంగా పాల్గొంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలకు( టీచర్స్ హెల్ప్ గ్రూపు) విజయవంతమైన సూచనలు అందిస్తారు..
🌺విద్యార్థుల్లో క్రమశిక్షణ కార్యక్రమాలు నేర్పుతూ వారిలో స్నేహపూర్వక వాతావరణం సృష్టిస్తున్నారు..
🌺మాకవరపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలోప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకొని 648 విద్యార్థులు నుండి 1367 విద్యార్థుల రోల్ పెరిగేటట్లు చేయుటలో మాస్టారు వినూత్న కార్యక్రమాలే కారణం..
🌺ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచన పుట్టుకొస్తాయి అనిదృఢంగా నమ్మే వ్యక్తి మన మాస్టారు..అందువలన అతను పనిచేస్తున్న పాఠశాలలో యోగా కార్యక్రమాలుకచ్చితంగా అమలు చేస్తారు..ఒక యోగ ఆశ్రమం లో ఎలాగ యోగా క్లాసులు అవుతాయో అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు యోగా క్లాస్ లు నిర్వహిస్తారు..
🌺 స్వతహాగా కబడ్డీ ప్లేయర్ అయిన మన మురళీమోహన్ మాస్టారు గారు..పిల్లలకు క్రీడల పట్ల అభిరుచి కలిగేటట్టు వారి నేమ్స్ ప్రింట్ అయ్యే విధంగా జెర్సీలు స్వచ్ఛంద సంస్థ నుంచి,మరియు తన సొంత డబ్బు నుంచి కూడా సమకూరుస్తారు..ప్రతి సంవత్సరం కొందరు విద్యార్థులు స్టేట్ కి సెలెక్ట్ అయ్యే విధంగా తర్ఫీదు ఇస్తారు..
🌺 తన పాఠశాల 10వ క్లాస్ విద్యార్థిని గీతాంజలికి ఆపరేషన్ నిమిత్తం తన స్టాప్ ద్వారా ఒక లక్ష రూపాయలు సమకూర్చి ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా మరొక 4 లక్ష లు సమకూర్చి ఆమె ఆపరేషన్ అందజేశారు ..
🌺 స్వచ్ఛంద సంస్థలు, దాతలు ద్వారా విద్యార్థులకు విద్యా సామగ్రిని ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు ..
🌺 కొత్త ఉపాధ్యాయ తరానికి నిజమైన మార్గదర్శకులు అయిన మన మురళి మోహన్ రావు మాస్టారు గారికి టీచర్స్ హెల్ప్ గ్రూప్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము🙏🙏💐💐💐💐👏👏👏👏👏👏👏.
మెరుగైన సమాజం కోసం
మీ
మెరుగైన సమాజం కోసం
మీ
టీచర్స్ హెల్ప్ గ్రూపు🙏🙏🙏
0 Comments:
Post a Comment