♦కొవిడ్ 19: ఎన్‌పీఎస్ ఉపసంహరణకు అనుమతి
🔸ముంబయి: కొవిడ్-19 చికిత్స ఖర్చుల కోసం జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) నుంచి కొంత మొత్తం ఉపసంహరించుకొనేందుకు అనుమతినిస్తున్నామని భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తెలిపింది. ‘కొవిడ్-19 మహమ్మారి కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రాణాలు హరించే కొవిడ్-19ను అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తిస్తున్నాం’ అని ప్రకటించింది.
🔸జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల చికిత్స కోసం చందాదారులు ఎన్‌పీఎస్ నుంచి కొంతమొత్తం ఉపసంహరించుకోవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్, ఏపీవై పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏనే నిర్వహిస్తోంది. మార్చి 31 నాటికి ఈ రెండు పథకాల్లో 3.46 కోట్ల మంది ఉన్నారు.

0 Comments:
Post a Comment