మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి రెండేళ్ల కోర్సుగా మారనుంది. ఇప్పటి వరకు ఆ కోర్సును మూడేళ్లు చదవాల్సి వచ్చేది.
దేశంలో 1990 ప్రాంతంలో ఈ కోర్సును ప్రవేశపెట్టగా గత దశాబ్దం నుంచి ఆదరణ కరవైంది. గతంలో డిగ్రీలో పలు కోర్సులు చేసిన వారు ఎంసీఏలో చేరేవారు. ఇప్పుడు బీఎస్‌సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ లాంటి కోర్సుల వారే చేరుతున్నారు.
ఈక్రమంలో మొదటి సంవత్సరంలో బోధించే ప్రాథమికాంశాలు అవసరం లేదని భావించిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ కోర్సును రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
0 Comments:
Post a Comment