ఆమె జీవితకాలంలో 26 ఏళ్లు క్వారంటైన్‌లోనే
ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి మనకున్న ఒకే ఒక్క ఆయుధం క్వారంటైన్. ఎవరికివారు ఇళ్లలో ఉంటే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. తద్వారా వైరస్ పీడ విరగడవుతుంది. అందుకే దేశాలు, రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించి మరీ ప్రజలను క్వారంటైన్ చేశాయి. అయినా కొందరు అవేవి పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉండటమంటే తెగ బోర్ కొట్టేస్తుందని, అదేదో నరకంలో ఉన్నట్లు మహా కష్టంగా ఉందని వాపోతున్నారు. 14 రోజుల క్వారంటైన్‌కే ఇలా అయిపోతే.. ఓ మహిళ తన 69 ఏళ్ల జీవితంలో రెండున్నర దశబ్దాలకు పైగా క్వారంటైన్‌లోనే గడిపిందంటే నమ్ముతారా? అవునండీ.. ఆమెను పోలీసులు బలవంతంగా 26 ఏళ్లు క్వారంటైన్‌లో ఉంచారు. ఆమెను ఎందుకు క్వారంటైన్‌లో ఉంచారు? ఆమె ఏం చేసింది? ఆమె కథేంటో మీరే చదవండి..
మేరీ మాలన్ ఓ వంటమనిషి.. 1868లో నార్త్ ఐర్లాండ్‌లో జన్మించిన ఆమె 1884లో అమెరికాకు వలస వచ్చింది. 1990.. 1907 మధ్యకాలంలో న్యూయార్క్‌లో ఏడుగురి ఇళ్లలో వంటమనిషిగా పనిచేసింది. 1901లో మమరొనెక్ ప్రాంతంలో ఓ ఇంట్లో మేరీ పనికి చేరిన రెండు వారాల తర్వాత ఆ ఇంట్లో వాళ్లు టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డారు. దీంతో ఆమె అక్కడ పని మానేసి మాన్‌హట్టన్‌లోని ఒకరి ఇంట్లో పనికి కుదిరింది. కొద్ది రోజులకే ఆ ఇంటి యాజమాని సహా కుటుంబసభ్యులంతా టైఫాయిడ్.. డయేరియాతో బాధపడ్డారు. ఆ ఇంటి చాకలి ఒకరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో మేరీ అక్కడ కూడా పని మానేసింది. మళ్లీ 1906లో ఒయిస్టర్ బే ప్రాంతంలోని నలుగురు ఇళ్లలో పని చేస్తే.. అక్కడ కూడా ఇంట్లోవాళ్లు టైఫాయిడ్‌తో ఆస్ప్రత్రుల్లో చేరారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియని మేరీ.. చివరగా న్యూయార్క్‌లో ఉండే ఛార్లెస్ హెన్రీ వారెన్ అనే బ్యాంక్ అధికారి ఇంట్లో వంట మనిషిగా చేరింది. అతను కూడా ఒయిస్టర్ బేకి మారడంతో వాళ్లతోపాటు ఆమె కూడా వెళ్లింది. అయితే మేరీ పని చేయడం ప్రారంభించిన రెండు వారాలకే హెన్రీ కుటుంబంలో 10 మందికి జ్వరం వచ్చేసింది. ఒక్క ఒయిస్టర్ బేలోనే తక్కువ సమయంలో పలు కుటుంబాలు టైఫాయిడ్ బారిన పడటం చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్న మేరీ నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం.
మేరీనే ఎలా కారణమైంది?
టైఫాయిడ్ జ్వరం సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. బాక్టీరియా కలిసిన ఆహారం, నీరు ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తోంది. అయితే ఈ బాక్టీరియా సోకిన వ్యక్తులు వాడిన వస్తువులు వాడటం, వారు చేసిన ఆహారం తినడం ద్వారా ఇది వ్యాపించే అవకాశాలున్నాయి. మేరీ వంటపని చేస్తుండటంతో ఆమె ద్వారా బాక్టీరియా ఆహారంలో కలవడం, ఆమె వాడిన వస్తువులు వాడటంతో ఇతరులకు ఈ బాక్టీరియా సోకి టైఫాయిడ్, డయేరియా రావడానికి కారణమైంది.
మేరీ మాలన్‌పై విచారణ
1906లో మేరీ పనిచేసిన ఓ కుటుంబం తమకు టైఫాయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు జార్జి సొపర్ అనే పరిశోధకుడిని నియమించింది. అతడు మేరీ వల్లనే టైఫాయిడ్ వస్తుందని అనుమానించాడు. అతడి అనుమానం బలపర్చేలా స్థానికంగా మరికొన్ని టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు తెలుసుకున్నాడు. దీంతో వారి ఇంటికి వెళ్లగా.. ఆ ఇంట్లో పని చేసే ఇద్దరు పనివాళ్లకు టైఫాయిడ్ రాగా.. ఇంటి యాజమాని కూతురు టైఫాయిడ్ కారణంగా మరణించింది. అదే ఇంట్లో పని చేస్తున్న మేరీని కలిసిన సోపర్.. వైద్య పరీక్షలకు సహకరించాలని కోరాడు. అందుకు మేరీ ఒప్పుకోలేదు. వారికి జ్వరం రావడానికి తనకు సంబంధమేంటని సోపర్ విజ్ఞప్తిని నిరాకరించింది. దీంతో సోపర్ బలమైన సాక్ష్యాల కోసం ప్రయత్నించాడు. మేరీ పని చేసిన ఇళ్లకు వెళ్లాడు. వారందరిని విచారించాడు. టైఫాయిడ్ రావడానికి ఆమెనే కారణమని నిర్ధారించుకున్నాడు. వైద్యుడిని వెంటబెట్టుకొని మేరీ దగ్గరికి వెళ్లాడు. అప్పుడు కూడా ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించింది.
తొలిసారి క్వారంటైన్ మూడేళ్లు..
ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో విచారణ జరిపిన న్యూయార్క్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా మేరీనే కారణమని గుర్తించారు. దీంతో 1907లో పలు సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసి క్వారంటైన్ చేశారు. బలవంతంగా నార్త్ బ్రదర్ ఐలాండ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. టైఫాయిడ్‌కు కారణమైన సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా మేరీ పిత్తాశయంలో ఆవాసం ఏర్పాటు చేసుకుందని తేలింది. ఆమె ద్వారానే ఇతరులకు బాక్టీరియా సోకుతుందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ విషయాన్ని మేరీ ఒప్పుకోలేదు. వ్యాధి తన వల్ల వ్యాప్తి చెందట్లేదని వాదించింది. కనీసం ప్రస్తుతం చేస్తున్న వృత్తిని అయినా మానేయమని చెప్పినా ఆమె విన్లేదు. దీంతో బలవంతంగా ఆమెను మూడేళ్లు క్వారంటైన్‌లో ఉంచారు.
అయితే అప్పటి హెల్త్ కమిషనర్ ఆమెను ఎక్కువ రోజులు క్వారంటైన్‌లో ఉంచడం మంచిది కాదని భావించారు. మళ్లీ వంటపని చేయనని, టైఫాయిడ్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానంటే వదిలేస్తామని మేరీకి మరోసారి అవకాశమిచ్చారు. దీనికి ఆమె ఒప్పుకోవడంతో ఫిబ్రవరి 19, 1910లో ఆస్పత్రి నిర్బంధం నుంచి విడుదలై న్యూయార్క్‌కు చేరుకుంది.
రెండోసారి క్వారంటైన్ 23 ఏళ్లు
క్వారంటైన్ నుంచి విడుదలైన మేరీ వంటపనిని వదిలేసి చాకలి పనిలో చేరింది. అలా ఐదేళ్లపాటు అదే పనిలో కొనసాగింది. అయితే వంటపనికన్నా తక్కువ జీతం వస్తుండటంతో అసంతృప్తికి గురైన ఆమె తిరిగి తన పాత వృత్తినే ఎంచుకుంది. కొన్ని ఇళ్లలో పని చేయగా.. అక్కడి వారందరికి టైఫాయిడ్ వచ్చింది. అయితే 1915లో మేరీ వల్ల పెద్ద సంఖ్యలో టైఫాయిడ్ బారిన పడ్డారు. న్యూయార్క్‌లోని ఓ మహిళా ఆస్పత్రిలో మేరీ పని చేయగా అక్కడ 25 మంది మహిళలు టైఫాయిడ్ బారిన పడటం గమనార్హం. అందులో ఇద్దరు మృతి చెందారు. ఇది కచ్చితంగా మేరీ పనేనని గుర్తించిన పోలీసులు మార్చి 27, 1915న ఆమెను అరెస్టు చేసి నార్త్ బ్రదర్ ఐలాండ్‌లోని ఆస్పత్రిలో క్వారంటైన్‌కు తరలించారు.
క్వారంటైన్‌లోనే కన్నుమూత
ఈ విషయంపై మీడియా కథనాలు ప్రచురించడం.. ఇంటర్వ్యూలు చేయడంతో మేరీ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయితే ఐలాండ్‌లో ఆస్పత్రిలో కొంతకాలం క్వారంటైన్‌లో ఖాళీగా ఉన్న మేరీకి అదే ఆస్పత్రిలోని ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా అధికారులు పని కల్పించారు. ఆ పని చేసుకుంటూ ఆమె అక్కడే కాలం వెళ్లదీసింది. అయితే 1932లో మేరీకి పక్షవాతం రావడంతో పూర్తిగా మంచానికి పరిమితమైంది. అలా ఆరేళ్లు గడిచిన తర్వాత నవంబర్ 11, 1938న మేరీ న్యూమోనియాతో బాధపడుతూ కన్నుమూసింది. ప్రభుత్వ అధికారులే ఆమె అంత్యక్రియలు పూర్తి చేసి బ్రాంక్స్‌లోని సెయింట్ రేమాండ్స్ స్మశానంలో సమాధి నిర్మించారు. మేరీ మాలన్‌పై ‘‘టైఫాయిడ్ మేరీ’’ పేరుతో పలు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 1993లో ఓ డాక్యుమెంటరీ చిత్రం విడుదలైంది. దీంతో మేరీ మాలన్ కాస్త టైఫాయిడ్ మేరీగా ప్రాచుర్యం పొందింది.

0 Comments:
Post a Comment