కరోనా వైరస్ సంక్షోభంతో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు. ఈ ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాలంటే డబ్బు కావాలి. ఇప్పటివరకు సేవింగ్స్ చేసినవాళ్లు ఆ డబ్బును వాడుకుంటున్నారు. మరి ఎలాంటి సేవింగ్స్ లేని వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. అయితే ఎల్ఐసీ పాలసీ ఉన్నవాళ్లు ఆ పాలసీపై లోన్ తీసుకునే అవకాశం ఉంది. రెగ్యులర్‌గా ప్రీమియంలు చెల్లిస్తున్నవారు మాత్రమే పాలసీపై లోన్ తీసుకోవచ్చు. అయితే అత్యవసరమైతే తప్ప ఈ లోన్ తీసుకోకూడదు. మరి బ్యాంకులో లోన్ల కన్నా ఎల్ఐసీ పాలసీపై తీసుకునే రుణాలతో లాభాలేంటో తెలుసుకోండి.
ఎల్ఐసీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉన్నవారెవరైనా లోన్ తీసుకోవచ్చు.
టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ పాలసీలకు లోన్ రాదు. పాలసీ సరెండర్ వ్యాల్యూపై లోన్ వస్తుంది. చాలావరకు మీ సరెండర్ వ్యాల్యూపై 70% నుంచి 90% వరకు లోన్ వస్తుంది. బ్యాంకులో పర్సనల్ లోన్ లేదా ఇతర ఏదైనా లోన్ తీసుకుంటే వడ్డీ రేటు ఎక్కువ. అదే ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11% నుంచి 18% మధ్య ఉంటాయి. అదే ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకుంటే వడ్డీ 9% నుంచి 11% మధ్య ఉంటాయి.అందుకే బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవడం కన్నా ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవడమే మేలు. వడ్డీ రేటు తక్కువ. ఈఎంఐలు చెల్లించాలి. అయితే వడ్డీని ఒకేసారి చెల్లించే అవకాశం ఉంది. ఎల్ఐసీ పాలసీపై తీసుకునే లోన్‌కు ష్యూరిటీ, సెక్యూరిటీ అవసరం లేదు. ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు. లేదా దగ్గర్లోని బ్రాంచ్‌కు వెళ్లి లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. మీ ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్‌కమ్ ప్రూఫ్, డీడ్ ఆఫ్ అసైన్‌మెంట్ లాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరి.
0 Comments:
Post a Comment