హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అనుబంధ సంస్థ. ఇళ్ల రుణాలను ఇచ్చే అతిపెద్ద సంస్థ కూడా. సిబిల్ స్కోర్ 800 పైన ఉన్న కొత్త కస్టమర్లకు 7.50 శాతానికే హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించింది. గతంలో ఈ వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది. అంటే హోమ్‌లోన్‌పై వడ్డీ రేటును ఏకంగా 60 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంతేకాదు ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ దగ్గర తీసుకునే రుణానికి సమానంగా సింగిల్ ప్రీమియం టర్మ్ అష్యూరెన్స్ పాలసీ తీసుకునే కస్టమర్లకు మరో 10 బేసిస్ పాయింట్స్ తక్కువకే హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించింది.
అంటే 7.40 శాతానికే హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.
ప్రస్తుత సంక్షోభం వ్యాపార కార్యకలాపాల్లో సోషల్ డిస్టెన్సింగ్ లాంటి పద్ధతుల్ని పాటించాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL హోమ్ లోన్ యాప్ ద్వారా మార్కెటింగ్ టీమ్స్ కస్టమర్లకు డిజిటల్ పద్ధతుల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ రంగంలో ఆత్మ విశ్వాసం నింపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.
— సిద్దార్థ మహంతీ, ఎండీ, సీఈఓ, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 27న రెపో రేట్ 75 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్‌పై భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ కూడా 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ కూడా అదే నిర్ణయం తీసుకుంది.

0 Comments:
Post a Comment