దేశంలో కరోనా భయంతో ప్రజలందరూ భయంతో ఉన్న వేళ ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. టీడీఎస్ మినహాయింపుల కోసం ఫైలింగ్ డెడ్‌లైన్‌ను పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్ మినహాయింపు కోసం ఫామ్ 15జీ, 15 హెచ్ సబ్మిట్ చేసే వ్యక్తులకు టీడీఎస్ ఫైల్ చేయడానికి మూడు నెలలపాటు గడువును పొడిగించింది. ట్యాక్స్ పరిధి కంటే తక్కువ ఆదాయం పొందే వర్గాలు టీడీఎస్‌ను ఫైల్ చేయాలి. సాధారణంగా వారు ఏప్రిల్‌లో వాటిని సబ్మిట్ చేయాలి. అయితే, మూడు నెలలు పొడిగించింది ఆదాయపన్ను శాఖ. గత ఆర్థిక సంవత్సరంలో సబ్మిట్ చేసిన ఫామ్ 15జీ, 15 హెచ్‌ల వ్యాలిడిటీ జూన్ 30 వరకు ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొంది. ఆర్థిక పరిస్థితి కూడా మందగించింది. బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందించలేని పరిస్థితి. ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు టీడీఎస్ ఫామ్స్ గడువులోగా ఫైల్ చేయడం కుదరకపోవచ్చని ఐటీ శాఖ అభిప్రాయపడింది. ఒకవేళ గడువులోగా సబ్మిట్ చేయకపోతే వారికి టీడీఎస్ కట్ అవుతుందనే ఆందోళన వారిలో ఉంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిధి కంటే తక్కువ సంపాదన ఉన్న వారు 15జీ ఫామ్ సబ్మిట్ చేస్తారు. సీనియర్ సిటిజన్లు 15 హెచ్ సబ్మిట్ చేస్తారు.

0 Comments:
Post a Comment