మీరు మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ చేయించాలా? థర్జ్ పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించాలా? లాక్‌డౌన్ కారణంగా చెల్లించలేకపోతున్నారా? ప్రీమియం చెల్లింపు గడువును పెంచాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI అన్ని హెల్త్ ఇన్స్యూరెన్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పాలసీ ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారికి ఊరట కల్పించాలని ఐఆర్‌డీఏఐ భావించింది. అందుకే గడువు పొడిగించాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలను కోరింది. అంతేకాదు... హెల్త్ ఇన్స్యూరెన్స్ గడువు పూర్తైనా వారికి కవరేజీని కొనసాగించాలని ఆదేశించింది.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదట లాక్‌డౌన్ ఉండటంతో వారికి ఏప్రిల్ 21 వరకు అవకాశం ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏప్రిల్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుండటంతో మరోసారి గడువు పొడిగిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 25 నుంచి మే 3 మధ్య హెల్త్ ఇన్స్యూరెన్స్, మోటార్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సిన వారికి మే 15 వరకు గడువు ఇచ్చింది. కాబట్టి మీరు ఈ లాక్‌డౌన్ సమయంలో ఇన్స్యూరెన్స్ రెన్యువల్ చేయించాలనుకుంటే మీకు మే 15 వరకు అవకాశం ఉంది.

0 Comments:
Post a Comment