ముంబై: ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. దీంతో చాలా దేశాలతోపాటే మన దేశమూ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ లాక్‌డౌన్ సమయాన్ని భారంగా గడుపుతున్నారు. అడుగు బయట పెట్టకుండా ఇంకా ఎన్ని రోజులు ఉండాలంటూ బాధపడుతున్నారు. కొందరు బోర్ కొడుతుంది అంటుంటే.. కొందరు పిచ్చెక్కిపోతుంది అంటున్నారు. మరి కొందరు మద్యం దొరకడం లేదని వింతగా ప్రవర్తిస్తున్నారు.
కానీ, మహారాష్ట్రలోని కార్ఖేడ గ్రామానికి చెందిన గజానన్, ఆయన భార్య మాత్రం మిగతా అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించారు. బోర్ కొడుతుందనో, పిచ్చెక్కుతుందనో ఖాళీగా కూర్చుని జుట్టు పీక్కోకుండా పనికొచ్చే ఆలోచన చేశారు. లాక్‌డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని ఇంటి ఆవరణలో చేదబావి తవ్వడానికి ఉపయోగించుకుని తాగునీటి కష్టాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా భూమి పూజచేసి బావి తవ్వడం మొదలుపెట్టారు.
రెండు మూడు రోజుల్లో బావి ఐదు ఫీట్ల లోతయ్యింది. దీంతో ఇంకా లోతుకు వెళ్లినా కొద్ది మట్టిని బయటికి తీయడం కోసం బావికి రెండు వైపు గుంజలు పాతి గిరక ఏర్పాటు చేసుకున్నారు. ఇక భర్త మట్టి తవ్వి డబ్బాలో నింపుతుంటే.. భార్య గిరక సాయంతో ఆ మట్టిని పైకి లాగి పక్కన పోసేది. ఇలా 21 రోజులు అయ్యే సరికి బావి లోతు 25 ఫీట్లకు చేరింది. బావిలోంచి ఊట నీరు ఉబికి వచ్చింది. ఆ భార్యాభర్తల కళ్లు ఆనందంతో మెరిసిపోయాయి.
లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా బావి తవ్వుకుంటే బాగుంటుందన్న తన ఆలోచనను తన భార్యకు చెప్పానని, అందుకు ఆమె కూడా అంగీకరించడంతో ఇద్దరం 21 రోజులు కష్టపడి ఫలితం సాధించామని గజానన్ తెలిపారు. అయితే బావి మొదలుపెట్టిన కొత్తలో ఇరుగుపొరుగు తమను ఎగతాళి చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగామని ఆయన చెప్పారు.

0 Comments:
Post a Comment