హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గుతున్నాయి. ఒకప్పుడు 9 శాతానికి పైగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7 శాతానికి చేరాయి. హోమ్ లోన్‌పై 1 శాతం వడ్డీ రేటు తగ్గినా క్టమర్లకు లక్షల్లో లాభం ఉంటుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్ తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువ. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారితో పాటు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునేవారికీ ఇది మంచి అవకాశం మరి ఏఏ బ్యాంకులు, సంస్థలు హోమ్ లోన్‌పై ఎంత వడ్డీని వసూలు చేస్తున్నాయో తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.20%-7.80%
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 7.20%-7.80%ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- 7.40%-8.50%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.20%-7.55%
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్- 7.25%-7.65%
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.25%-8.15%బ్యాంక్ ఆఫ్ బరోడా- 7.25%-7.25%
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.25%-8.35%
కెనెరా బ్యాంక్- 7.30%-9.30%
ఇండియన్ బ్యాంక్- 7.40%-8.40%
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 7.45%-7.70%
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.45%-8.85%
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్- 7.90%-9.00%
యూకో బ్యాంక్- 7.85%-11.10%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 7.95%-8.80%
సౌత్ ఇండియన్ బ్యాంక్- 8.05%-8.80%
0 Comments:
Post a Comment