తేనె చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తేనెలో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఫలితంగా వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పుప్పొడి ఉన్నాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారవుతాయి. కాలానుగుణ వచ్చే అలెర్జీల నుండి ఉపశమనం పొందుతాయి. ఇక రోగ నిరోధక శక్తి పెంచే మరో అద్భుతం నల్ల మిరియాలు, వీటినే కాలిమిర్చి అని పిలుస్తారు. అయితే నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే ఈ నల్ల మిరియాలను ఏదో ఒక రూపంలో రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.
మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇవి మాత్రమే కాక ఆరోగ్యంగా ఉండటానికి, సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. రోజూ వ్యాయామం చేయండి. మీ బరువు, రక్తంలో చక్కెర శాతాలను పరిశీలించుకోండి. మీ ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి. సమతుల్య ఆహారం తీసుకోండి. కచ్చితంగా 8 గంటలు నిద్రపోండి. అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది.

0 Comments:
Post a Comment