పాలసీల పునరుద్ధరణకు గడువు పొడిగింపు
న్యూదిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో గడువు ముగుస్తున్న థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. బీమా పాలసీల పునరుద్ధరణకు గడువును మే 15 వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ట్విటర్ వేదికగా తెలిపారు. మార్చి 25 నుంచి మే 3 తేదీల మధ్య గడువు ముగియనున్న థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటు వర్తించనుంది. తొలుత అమలులో ఉన్న లాక్‌డౌన్ సందర్భంగా కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పాలసీ చెల్లింపుల గడువును పొడిగిస్తూ గతంలో కూడా నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే మే 15కు ముందుగానే రెన్యువల్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా పాలసీదారులకు ఎదురయ్యే సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ గ్రేస్ పీరియడ్ కాలంలో వచ్చిన క్లెయింలకు ఏ ఆటంకాలు కలిగించకుండా చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థిక మంత్రి బీమా సంస్థలకు సూచించారు.

0 Comments:
Post a Comment