ఆంగ్లంతోనే అనుసంధానం
(తేది:23/4/2020 అంతర్జాతీయ ఆంగ్లభాషా దినోత్సవం)
పేరులో ఏముందంటారు? ప్రఖ్యాత ఆంగ్ల రచయిత విలియం షేక్స్‌పియర్. ఒక భాష దీర్ఘకాలం మనుగడలో ఉండాలంటే ఆ భాషలో రచయితలకు ప్రోత్సాహం అందించాలి. వారి రచనలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. ఐక్యరాజ్యసమితిలో అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్‌లు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య సమన్వయం పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23ని అంతర్జాతీయ ఆంగ్లభాషా దినోత్సవంగా జరుపుతుంది. తొలిసారి 2010లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌డే ని, మార్చి 20 ఫ్రెంచ్ లాంగ్వేజ్‌డే జరిపారు. ఏప్రిల్ 23న ఇంగ్లీష్, స్పానీష్ లాంగ్వేజ్‌డేగా, జూన్ 6న రష్యన్ లాంగ్వేజ్ డేగా, డిసెంబర్ 18న అరబిక్ లాంగ్వేజ్‌డే గా జరుపుతారు. సుమారు 1500 సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా మూడు తెగలు మాత్రమే ఆంగ్లాన్ని మాట్లాడే వారు.
ఈ రోజు 67 దేశాలలో ఆంగ్లం అధికార బాషగా చలామణి అవుతోంది. మరో పది దేశాలలో ఈ భాష ప్రత్యేక భాషగా హోదా పొందింది. దాదాపు 106 దేశాలలో ఇంగ్లీష్ ప్రధమ భాషగా ఉంది. 340 కోట్ల మంది ప్రజలు ఇంగ్లీష్‌ని మాతృభాషగా కల్గి ఉన్నారు. ఒకప్పుడు గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, సంస్కృతం భాషలు గొప్ప భాషలుగా, రాజ భాషలుగా చలామణి అయ్యాయి. బ్రిటీష్ వారు అనుసరించిన వలస విధానం వలన ఆంగ్లం అంతర్జాతీయ భాషగా ఎదిగింది. షేక్స్‌పియర్, జి.బి.షా, టి.యస్. ఇలియట్ వంటి ఎందరో రచయితలు ఆంగ్లంలో గొప్ప గొప్ప రచనలు చేసి ఆంగ్లభాషకి వన్నె తెచ్చారు. ఆక్స్‌ఫర్డ్ నిఘంటవులో ప్రతి సంవత్సరం 1000 పైగా పదాలు కొత్తగా చేరతాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌డే సందర్భంగా విలియం షేక్స్‌పియర్‌ని ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటారు. ఆయన 1564లో ఇదే రోజు ఇంగ్లాండ్‌లో జన్మించాడు. మానవ సంబంధాలు, ప్రేమ, యుద్ధం, అధికారం కోసం తపన తదితర విషయాలు ఆయన తన రచనలలో అద్భుతంగా వివరించేవారు. విషాద సన్నివేశాలలో కూడా ఆయన హాస్యాన్ని పండించేవారు. ఇదొక వినూత్న ప్రయోగం. రెండు దశాబ్దాల పాటు ఆయన రచనలు చేశారు. రోమియో అండ్ జూలియట్ వంటి ప్రేమకధలు, హెన్రీ, రిచర్డ్ వంటి చరిత్రలు, యాజ్‌యు లైక్, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, హామ్లెట్, ఒథెల్లో, మేక్‌బెత్, కింగ్ లియర్ వంటి విభిన్న రచనలు చేశారు. ఆయన రచనల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి.
‘ది మర్చంట్ ఆఫ్ వెనిస్’లో యాంటినియో పాత్ర నైతిక విలువలకు కట్టుబడి సాగుతుంది. షైలాక్ పాత్ర స్వార్ధ పూరితంగా సాగుతుంది. ఆయన రచనలలో పగ, ప్రతీకారం, పశ్చాత్తాపం తదితర అంశాల ప్రముఖంగా కనిపిస్తాయి. మధ్యయుగంలో సామ్రాజ్య వాదానికి, మతవ్యాప్తికి ఆంగ్లం దోహదపడగా, ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాలకు ఊతం ఇచ్చింది. రవీంద్రనాధ్ ఠాగూర్, ఆర్.కె.నారాయణన్, సరోజిని నాయుడు వంటి భారతీయ రచయితలు ఇంగ్ల్లీష్‌లో రచనలు చేసి ఆ భాషని సుసంపన్నం చేశారు. ఏ భాషకైనా రచనలే ఊపిరి. రచయితలను పాలకులు ప్రోత్సహిస్తే పద సంపద పెరుగుతుంది. కొత్త పదాలు సృష్టించబడతాయి. సాహిత్యం పరిపుష్ఠం అవుతుంది. ఒక ప్రాంతం యొక్క సంస్కృతి సంప్రదాయాలు మరొక ప్రాంతానికి తెలుస్తాయి. ‘గీతాంజలి’ ఆంగ్లంలోకి అనువదింపబడిన తర్వాత ఠాగూర్‌కి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. హిందీ భాషని కూడా యుయన్‌ఓలో అధికార భాషగా చేర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తూనే హిందీకి అంతర్జాతీయ హోదా కల్పించడానికి కృషి చేయాలి. ఆధునిక అవసరాలకనుగుణంగా నిఘంటువులు రూపొందించాలి. ఆంగ్ల భాషా ప్రవాహంలో ప్రాంతీయ భాషలు కొట్టుకుపోకుండా చూడాలి. అలాగే ఆంగ్లాన్ని ఉద్యోగ ఉపాధి వనరులని కల్పించే భాషగానే చూడకుండా ప్రపంచ చరిత్ర, వర్తమాన పరిస్థితులు తెలుసుకునేందుకు ఉపయోగపడే అనుసంధాన భాషగా చూడాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్ధులకు ఆంగ్లంలో నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలి.
- యం. రాంప్రదీప్ 9492712836

0 Comments:
Post a Comment