ఉపాధ్యాయుడే సమాజానికి నిజమైన నవ నిర్మాణ శిల్పి అనడానికి ఉదాహరణ గధాము దుర్గాప్రసాద్..ఈయన ప్రస్తుతం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ ప్రైమరీ స్కూల్లో (చిట్టి వలస ,భీమిలి జోన్ విశాఖపట్నం జిల్లా) హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు .ఈయన తన పని చేసిన స్కూల్ ని కార్పొరేట్ స్కూల్ కి తలదన్నే విధంగా తయారు చేశారు..నిత్యం స్కూల్ అభివృద్ధికి ఆలోచన చేయడం ద్వారా తన స్కూల్ని అధికారులు మెచ్చుకునే విధంగా తయారు చేయడంలో ఇతను మాత్రం ముఖ్యమైనవి...
ఇలా చేయడంలో ప్రసాద్ గారు అమలుపరిచిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.
1) నాందివంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యార్థులకు అవసరమైన బ్యాగులు పుస్తకాలు పెన్నులు అందించారు
2)ప్రభుత్వంప్రకటించిన పాఠశాల వేడుకల్లో విద్యార్థులకు వినూత్న వేషధారణ( ఉదాహరణకు భరతమాత స్వతంత్ర వీరులు వేషధారణ)వేయుట ద్వారా విద్యార్థుల్లో జాతీయ భావం కలిగించడం
3)తల్లిదండ్రుల సమావేశం ప్రతినెల ఖచ్చితంగా ఏర్పాటుచేయడం ద్వారా విద్యార్థుల చదువు విషయాలను తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు..
4)సామాజిక సహకారం లో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేస్తారు అదేవిధంగా విద్యార్థుల ఆర్థిక అవసరాలు కూడా తీరుస్తారు.
*5)తను పాఠశాలలకు నెలకు కొంత మొత్తాన్ని ఇస్తూ మిగతా ఉపాధ్యాయుల వద్ద సేకరిస్తూ విద్యార్థి విద్యా అవసరాలను తీరుస్తున్నారు..ఆ నగదుతో విద్యార్థులకు మినరల్ వాటర్ ను అందిస్తున్నారు..
6)పాఠశాలలో లు 90 నుండి 120 పెరగడంలో అతను చేస్తున్న కార్యక్రమాలు నిదర్శనం..
7)నేను ఒకసారి ఆ స్కూల్ కి వెళ్లాను. ఆ స్కూలు పరిసరాలు మన ఇంటి వద్ద ఎలా ఉందో ఆ రకంగా పరిశుభ్రంగా ఉంది..పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నారు
8)ఒక క్రీడాకారుణుగా ,చిత్రకారునిగా ఆ వచ్చిన తన నైపుణ్యాలను పిల్లలు నేర్పించడంలో సఫలీకృతులయ్యారు..
9)పిల్లల తమంతట తాము ఆడుకునే విధంగా కాకుండా ఉపాధ్యాయులే పిల్లలను వివిధ ఆటలు ఆడిస్తారు..
ఈయన చేసిన సేవలను తోటి ఉపాధ్యాయులు ,అధికారుల ప్రశంసలు అందుకున్నారు...
0 Comments:
Post a Comment