లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో సవరణలు
దిల్లీ: లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసింది. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది. అటవీ ఉత్పత్తులు, కలప సేకరణను వ్యవసాయ కార్యకలాపాల్లో చేర్చింది. కొబ్బరి, వెదురు, కోకో, సుగంధ ద్రవ్యాల సాగు, శుద్ధి, ప్యాకేజింగ్‌కు అవకాశం కల్పిస్తూ సవరణలు చేసింది. ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్‌డౌన్ పొడిగింపు తర్వాత అనేక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం మరిన్ని అంశాలు జోడించింది. తక్కువ సిబ్బందితో పనిచేసే నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, టెలిఫోన్, ఆప్టికల్ ఫైబర్ లైన్ల పనులకు అనుమతులు ఇచ్చింది. ఈమేరకు అన్ని శాఖలు, విభాగాల అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

0 Comments:
Post a Comment