మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినా పూర్తిగా తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? అన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన.. మే 3 తర్వాత కూడా కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని ప్రకటించారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతకంటే ముందు ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. దేశాన్ని పరిరక్షించుకొనేందుకు ముందు ఉన్న మార్గం లాక్‌డౌన్ ఒక్కటేనని ఆయన వివరించారు. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని అన్నారు.
కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగింపునకు, కొన్ని సడలింపులకు మొగ్గుచూపుతున్నాయని చెప్పారు.
అయితే, కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతాల్లో మినహాయింపులు ఉండబోవని వెల్లడించారు. కొన్ని గ్రీన్ జోన్లలో మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని సూచన ప్రాయంగా తెలిపారు. ఆ తర్వాత కూడా ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
Also Read....
YSR PENSION STATUS CHECK
Ration Card status check
🔎YSR Arogyasri card Status
New.... Google Android Apps
0 Comments:
Post a Comment