ఈపీఎఫ్ ఖాతాలో పుట్టిన తేదీ మార్చుకోవచ్చు
ఆధార్ కార్డులో ఉన్న తేదీతో సరి చేసుకోవచ్చు
EPF ఖాతాదారులు రికార్డుల్లోని పుట్టిన తేదీని మార్చుకోవడానికి ఈపీఎఫ్‌వో అనుమతిచ్చింది. ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని అధీకృత ఆధారంగా అంగీకరించనున్నారు. దాన్ని చూపి తేదీని సరిదిద్దుకోవడానికి ఖాతాదారులకు అవకాశం ఇచ్చారు. అయితే అంతకుముందున్న తేదీ, ప్రస్తుతం మార్చబోయే తేదీల మధ్య మూడేళ్లలోపు తేడా ఉంటేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇందుకు అర్హులైన వారు తమ విజ్ఞప్తులను ఆన్‌లైన్‌ద్వారా సమర్పించవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ తెలిపింది. ఇలా వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఈపీఎఫ్‌వో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు కేవైసీలో లోపాలు సరిచేసుకునేందుకు ఈ వెసులుబాటును ఉపయోగించుకుని కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది.

0 Comments:
Post a Comment