న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: వేసవిలో కరోనా వైరస్ చచ్చిపోతుందా? ఎక్కువగా వ్యాప్తి చెందదా? ఏసీల వాడకంతో వైరస్ వృద్ధి చెందుతుందా? ప్రస్తుతం ఇలాంటి సమాధానాల్లేని ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వైరస్ వ్యాప్తికి, ఉష్ణోగ్రతలకు సంబంధం లేదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేశాయి. ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగితే కొవిడ్-19 వైరస్ బతికే అవకాశాలు తక్కువని, ఏసీలు వాడితే ఉష్ణోగ్రతలు తగ్గి వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉంటుందని తొలుత కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కానీ, తాజాగా ఇద్దరు వైద్యులు మాత్రం కరోనా వైరస్ వృద్ధికి, ఇళ్లలో ఏసీలకు సంబంధం లేదని చెబుతున్నారు.
ఇళ్లలో విండో ఏసీలు వాడడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని డాక్టర్ అపర్ణ అగర్వాల్ వెల్లడించారు. ఆస్పత్రులు సహా పెద్దపెద్ద సముదాయాల్లో సెంట్రలైజ్డ్ ఏసీలు వాడతారని, అలాంటి చోట్ల కరోనా రోగి ఉంటే కొన్ని సమస్యలు తప్పవని తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల్లో వైరస్ విస్తృతి తగ్గుతుందేమోనన్న అంచనా మాత్రం ఉందని, అది ఎంత వరకు నిజమో వేచి చూడాల్సిందేనని ఆమె చెప్పారు.

0 Comments:
Post a Comment