న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు దేశంలో లాక్‌డౌన్ పూర్తయ్యేవరకు తమ పోర్టల్‌ద్వారా అత్యవసర వస్తువులను మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు సోమవారం నుంచి అమల్లోకి రానుంది. వేటికి నిబంధనల సడలింపు వర్తిస్తుంది, ఏయే రంగాలు కార్యకలాపాలు నిర్వహించువచ్చనే జాబితాను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ-కామర్స్ బిజినెస్‌కు సంబంధించిన నియమాళిని తాజాగా సవరించింది. లాక్‌డౌన్ కాలంలో అనవసర వస్తువులను పంపిణీ చేయడానికి అనుమతి లేదని, నిత్యావసరాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. గతంలో విడుదల చేసిన జాబితాలో మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, బట్టలు, బడి పిల్లలకు అవరసమైన స్టేషనరీ వస్తువులను ఆన్‌లైన్ పోర్టళ్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అమ్ముకోవచ్చని పేర్కొన్నది.
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పంపిణీ జాబితాలో వీటిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పంపిణీ జాబితాలో వీటిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
0 Comments:
Post a Comment