ఊరెళ్లాక అసలు కష్టాలు మొదలయ్యాయి ఆయనకు. అక్కడ నెట్‌వర్క్ తక్కువగా ఉండటంతో అతడి సెల్‌ఫోన్‌కు సిగ్నల్ అంతంతమాత్రమే వచ్చేది. ఫలితంగా ఇంటర్నెట్ పనిచేయలేదు. కానీ అతడు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు తరగతులు బోధించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అతడి మెదడులో ఓ ఆలోచన తట్టింది. తన ఇంటి సమీపంలోని ఓ వేప చెట్టెక్కి సిగ్నల్ కోసం ప్రయత్నించగా అది ఫలించింది. దీంతో ఆ చెట్టుపైనే కర్రలతో చిన్నపాటి నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచే విద్యార్థులకు పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు.
ఉదయాన్నే భోజనం, నీరు తీసుకొని చెట్టెక్కుతానని, ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో రెండు నుంచి మూడు తరగతులు బోధిస్తానని చెప్పుకొచ్చాడు సుబ్రతాపాటి. చెట్టుపై ఎలాంటి అంతరాయం లేకుండా సిగ్నల్ వస్తోందని తెలిపారు. ఎండ తీవ్రత ఇబ్బంది పెడుతున్నా తట్టుకుంటున్నానని చెప్పాడు. తనవల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదంటున్నాడు ఈ 35 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయుడు.
0 Comments:
Post a Comment