తిరువన్నామలై: కరోనా భయంలో ఎవరూ ఇంటిని అద్దెకు ఇవ్వకపోవడంతో చైనా యువకుడొకరు ఓ కొండ గుహలో తలదాచుకున్న వైనమిది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా అన్నామలయార్ హిల్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు అతడికి పరీక్షలు నిర్వహించి కరోనా లేదని తేల్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఓ ప్రయివేటు ఆస్పత్రిలో క్వారంటైన్ చేశారు. చైనా రాజధాని బీజింగ్‌కి చెందిన సదరు యువకుడిని యావోరుయ్ యాంగ్‌గా గుర్తించారు. యోగా నేర్చుకునేందుకు గత పదేళ్లుగా అతడు భారత్ వస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి తమిళనాడు వెళ్లిన అతడు... కోవిడ్-19, లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.
''నాకు యోగా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. యోగా తర్ఫీదు కోసం నేను చాలా సార్లు రుషికేశ్ వెళ్లాను. ఉత్తర భారత దేశంలో కూడా పలుచోట్ల పర్యటించాను. అన్నామలయార్ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలుసుకుని తిరువన్నామలై వచ్చాను..'' అని యాంగ్ వివరించాడు.
ఫిబ్రవరి 26న తిరువన్నామలై వచ్చిన యాంగ్.. రమణ ఆశ్రమం సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే గతనెల 24న దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో... ఇంటి యజమాని బలవంతంగా అతడిని ఖాళీ చేయించాడు. ''నేను ఎక్కడికి వెళ్లినా నా దేశం గురించి తెలుసుకుని ఎవరూ నాకు లాడ్జిల్లో, ఇళ్లలో ఉండేందుకు అవకాశం ఇవ్వలేదు. నావల్ల వైరస్ సోకుతుందేమోనని భయపడ్డారు...'' అని అతడు పేర్కొన్నాడు. చివరికి ఓ స్థానిక గైడ్ సాయంతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు అన్నామలై కొండలపై ఓ గుహలో తలదాచుకున్నానని తెలిపాడు. ''ప్రతిరోజూ ఉదయం నేను కొండపై నుంచి కిందికి దిగి బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కొనుక్కుని వెళ్లే వాడిని. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఓ సురక్షిత ప్రాంతంలో నివసించాలని భావించానే తప్ప... ప్రభుత్వం నుంచి దాక్కోవడం లేదా మోసం చేయడం నా ఉద్దేశం కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా నెల రోజుల పాటు తిరువన్నామలైలో ఉండి, యోగా సాధన చేయాలని మాత్రమే కోరుకున్నాను..'' అని యాంగ్ తెలిపాడు.
కాగా యాంగ్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కేఎస్ కందసామి మాట్లాడుతూ.. ''కొందరు స్థానికులు సమాచారం ఇవ్వడంతో మేము వెంటనే అక్కడి వెళ్లాం. యాంగ్ ఓ గుహలో తలదాచుకుంటున్నట్టు గుర్తించి ప్రయివేటు ఆస్పత్రికి తరలించాం. అదృష్టవశాత్తూ అతడికి కొవిడ్-19 నెగెటివ్ అని తేలింది...'' అని వెల్లడించారు. యాంగ్ తన స్వస్థలానికి తిరిగి వెళ్లే వరకు జిల్లా యంత్రాంగం అదే ఆస్పత్రిలో అతడికి ఆహారం, వసతి సదుపాయం కల్పిస్తుందన్నారు.

0 Comments:
Post a Comment