కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జగన్ సర్కారు ఇటీవలే దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కిట్ల ద్వారా హాట్ స్పాట్‌లలో కోవిడ్ కేసులను త్వరితగతిన గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. కరోనా టెస్టింగ్ విధానంపై కేంద్రం కీలక సూచనలు కేంద్రం..ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దని రాష్ట్రాలకు సూచించింది. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఇప్పటికే రాష్ట్రాలకు అందించామని వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కిట్లు యాక్యురేట్ గా లేవని సరిగా పని చేయడం లేదని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ సూచన మేరకు కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
0 Comments:
Post a Comment