ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలం. అయితే ఆరోగ్యంగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన జీవనశైలి, ఆహార అలవాట్లు ఇవన్ని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక ఆరోగ్యాన్ని అందించే వాటిలో మజ్జిగ కూడా ఒకటి. మార్కెట్‌లో దొరికే శీతలపానీయాల వలన రోగాలు తెచ్చుకోవడానికి ఇష్టపడతాం తప్ప. మన ఇంట్లో దొరికే మజ్జిగ తాగడానికి మాత్రం ఇష్టపడం. కాని, మజ్జగ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పరగడుపున మజ్జిగ తాగితే మరిన్ని లాభాలు పొందొచ్చు.
ప్రతి రోజు ఉదయం మజ్జిగను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ, సమస్యలు ఉండవు. మీరు కనుక డైయట్ పాటిస్తుంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు.
ఎందుకంటే వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉండటమే కాక, క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఇక మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని త్రాగితే విరేచనాలు తగ్గుతాయి.
మరియు ఎండాకాలంలో వచ్చే డీ హైడ్రేషన్ సమస్య కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా, శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది. ఒక హెవీ బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు క్రమం తప్పకుండా మజ్జిగనుతాగడం వల్ల బీపీ నియంత్రనకు వస్తుంది. కాబట్టి, పరగడుపున టీ, కాఫీలు తాగేబదులు మజ్జిగ తాగడం ఉత్తమం.

0 Comments:
Post a Comment