న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడయింది. ఎటువంటి సడలింపులు లేకుండా లాక్‌డౌన్‌ను మే 3 వరకు ఇలాగే కొనసాగిస్తే.. 4 రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది కష్టమేనని తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చుకునేందుకుగాను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాలు రుణాల ద్వారా ఆదాయాన్ని సేకరించుకునేందుకు డబ్ల్యూఎంఏ లిమిట్‌ను ఆర్‌బీఐ 60 వరకు పెంచింది. అయి నా..వీటితోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాల సొంత ఆదాయ వనరులు స్తంభించిపోనున్నాయని, ఇది చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది.
0 Comments:
Post a Comment