ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కోవిడ్ 19 వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, యునాని, ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వారియర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర కోవిడ్ 19 ప్రత్యేకాధికారి గిరిజా శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి ఆసక్తి కలిగిన వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కలిగిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా కోవిడ్ వారియర్స్‌గా నమోదు చేసుకోవచ్చు. వారి సేవలను ఆస్పత్రుల్లో వైద్య సేవలకు, నర్సింగ్ సేవలకు క్వారంటైన్ సెంటర్లలో వాలంటీర్లుగా ఉపయోగించుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్‌మెంట్లలో వాలంటీర్లుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తుందని ఆప్రకటనలో తెలిపింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://health.ap.gov.in/CVPASSAPP/Covid/VolunteerJobs అనే వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు (ఏప్రిల్ 8) 2000 మంది వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వాలంటీర్లకు అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఇస్తుంది. 9, 10వ తేదీల్లో వారికి శిక్షణ అందిస్తారు. వాలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటారు. ఈ శిక్షణలో అందరూ పాల్గొని కోవిడ్ 19 నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర కోవిడ్ 19 ప్రత్యేక అధికారిక ఎం.గిరిజా శంకర్ తెలిపారు.
0 Comments:
Post a Comment