తెలంగాణలో లాక్ డౌన్ కాలాన్ని పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు మే 3 వరకు యధావిధిగా కొనసాగుతుందని, అయితే, తెలంగాణలో మే 7 వరకు కూడా లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం సుమారు ఆరు గంటల పాటు కొనసాగింది. ఆ కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మే 5వ తేదీన తెలంగాణ కేబినెట్ మరోసారి సమావేశం అవుతుందని అప్పటి పరిస్థితులను బట్టి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో రేపటి నుంచి ఎలాంటి లాక్ డౌన్ సడలింపులు లేవని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
0 Comments:
Post a Comment