న్యూయార్క్: అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా భయానక కరోనా వైరస్ బారిన పడి చివురుటాకులా వణికిపోతోంది. రోజూ వందల సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలను దాటి పోయింది. ఎనిమిది వేల మందికి పైగా మరణించారు. ఒక్కరోజ వెయ్యిమందికి పైగా అమెరికన్లు మృతి చెందారు. ఈ వారం రోజుల వ్యవధిలో అమెరికాలో వెయ్యి మందికి పైగా మరణించడం ఇది రెండోసారి.
1
భారత సహాయాన్ని కోరిన అమెరికా
కరోనా విధ్వంసాన్ని ఎదుర్కొనడానికి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో అమెరికా దాదాపు చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. వచ్చే రెండు వారాల్లో మరిన్ని మరణాలను చూస్తామంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ పరిస్థితుల్లో- కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి అమెరికా.. భారత్ సహాయాన్ని కోరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బహిరంగంగా విజ్ఙప్తి చేశారు.
2
హైడ్రోక్సిక్లొరోక్విన్‌ను సరఫరా చేయాలంటూ..
మలేరియా సోకిన వారికి అందించే వైద్య చికిత్సలో వినియోగించే హైడ్రోక్సిక్లొరోక్విన్‌ను వెంటనే సరఫరా చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఙప్తి చేశారు. హైడ్రోక్సిక్లొరోక్విన్ డ్రగ్‌ను కరోనా వైరస్ సోకిన పేషెంట్ల వైద్య చికిత్సలో వినియోగించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ యాంటీ మలేరియన్ డ్రగ్ ఎగుమతులను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా- ఈ డ్రగ్ చాలినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల అమెరికా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీన్ని వెంటనే సరఫరా చేయాలని ట్రంప్ కోరారు.
3
భారత పోరు అద్భుతం..
కరోనా వైరస్‌పై భారత్ అద్భుతమైన పోరాటాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ ప్రశంసించారు. 130 కోట్ల మంది భారతీయులను ఒక్క పిలుపుతో నరేంద్ర మోడీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని అన్నారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు చూపిన సంయమనం అద్వితీయమని చెప్పారు. యాంటీ మలేరియన్ డ్రగ్ హైడ్రొక్సిక్లొరోక్విన్ అవసరాలు భారత్‌కు కూడా ఉంటుందని, అయినప్పటికీ.. తమకూ ఆ మందుల అవసరాలు ఉన్నాయని చెప్పారు.
4
ఒకేరోజు 34 వేలకు పైగా పాజిటివ్ కేసులు
అమెరికాలో ఒకేరోజు 34 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలను అధిగమించింది. 3,11,357 మంది కరోనా బారిన పడ్డారు అమెరికాలో. మరణాల సంఖ్య ఎనిమిది వేల మార్క్‌ను దాటేసింది. ఒకేరోజు 1,048 మంది అమెరికన్లు ఈ వైరస్ బారిన పడి మరణించారు. సరైన ముందుజాగ్రత్తలను తీసుకోకపోవడం వల్ల అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

0 Comments:
Post a Comment