పసిడి ధర రికార్డు సృష్టించింది. ఏకంగా బంగారం రేటు తులానికి రూ.47 వేలకు చేరుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరగడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10) బంగారం 1,750 డాలర్ల స్థాయికి చేరుకుంది. అలాగే ఇన్వెస్టర్లు కూడా పడిసిపై భారీగా పెట్టుబడులు పెట్టడంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం రేటు కూడా ఆల్‌టైం కనిష్ట స్థాయికి చేరి బలహీనపడింది. దాంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి.
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో కాస్తా.. బంగారం, భారీ విలాసవంతమైన వస్తువులపై డిమాండ్ బాగా తగ్గిపోయింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా డిమాండ్ పెద్దగా ఉండకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు పసిడి కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గిపోయాయని అంచనా వేస్తున్నారు. కాగా 2019లో దేశవ్యాప్తంగా మొత్తంగా 690.4 టన్నుల బంగారాన్ని వినియోగించగా.. ఈ ఏడాది ఆరంభంలోనే కరోనాతో ఉన్న కాస్త డిమాండ్ కూడా తగ్గిపోయిందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

0 Comments:
Post a Comment