ఆరోగ్య సేతు యాప్ ఓకే అంటేనే ఆఫీసుకు
కేంద్ర ఉద్యోగులకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశం
ఈనాడు, దిల్లీ: ఆరోగ్య సేతు యాప్ ఓకే చెబితేనే ఆఫీసులకు బయలుదేరాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పొరుగు సేవల సిబ్బందితో సహా అందరు ఉద్యోగులు, అధికారులు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఆ యాప్‌లో తమ పరిస్థితిని సమీక్షించుకోవాలని తెలిపింది. అందులో ‘సేఫ్’ (ప్రమాదం లేదు) అని గానీ, ‘లో రిస్క్’ (ముప్పు తక్కువ) అని గానీ చూపిస్తేనే కార్యాలయానికి బయల్దేరాలని స్పష్టంచేసింది. ఒకవేళ అందులో మోడరేట్ (మధ్యస్థం), హైరిస్క్ (ముప్పు ఎక్కువ) అని వస్తే మాత్రం ఆఫీసుకు రాకుండా 14 రోజులు ఇంట్లోనే ఏకాంతవాసంలో ఉండాలని పేర్కొంది. బ్లూటూత్ ఆధారంగా సదరు వ్యక్తి ఇటీవల కలిసిన వ్యక్తులను బట్టి పరిస్థితులను ఈ యాప్ అంచనా వేస్తుందని తెలిపింది. తిరిగి సేఫ్, లేదా లో రిస్క్ స్టేటస్ వచ్చిన తర్వాతే కార్యాలయాలకు రావాలని సూచించింది. తప్పనిసరిగా ఈ నిబంధనలను అమలు చేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి జి.జయంతి పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment