Corona Lockdown | Coronaupdate : ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజలను కరోనా వైరస్ చంపేస్తున్నా... ఇప్పటికీ దాన్ని ఎదిరించగలమనే కాన్ఫిడెన్స్ మనలో ఉండటానికి ప్రధాన కారణం చైనాయే. అక్కడ వైరస్ ప్రభావం ఒక్క హ్యూబే ప్రావిన్స్‌కే పరిమితం అవ్వడం వల్ల... వాళ్లు చెయ్యగలిగింది మనం చెయ్యలేమా అని ప్రపంచ దేశాలన్నీ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి. ఎన్నో వైరస్‌లను జయించిన మానవాళికి కరోనా పెద్ద మేటరేమీ కాదు. కాకపోతే... ఎన్నాళ్లిలా? ఇప్పటికే నాలుగు నెలలు దాటాయి. దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుంది అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్ కనుక్కునే వరకూ ఈ వైరస్ ప్రపంచాన్ని వదిలే అవకాశాలు లేవంటున్నారు. ఆలోగా ఈ వైరస్ ఒక్కో వ్యక్తికీ రెండేసి సార్లు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు.
వైరస్ వదిలిపోవాలంటే... ప్రపంచ ప్రజల్లో ఇమ్యూనిటీ (వ్యాధినిరోధక శక్తి) పవర్ పెరగాలి. అలాగే... ఈ వైరస్‌ని కచ్చితంగా చంపే వ్యాక్సిన్ తయారవ్వాలి. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎందుకంటే... వైరస్‌లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాన్రానూ అవి ప్రమాదకర వాతావరణాల్ని కూడా తట్టుకునేలా రూపాంతరం (Mutation) చెందగలవు. ఇప్పుడున్న వైరస్‌ని చంపేందుకు ఇప్పుడే వ్యాక్సిన్ తయారైతే పర్వాలేదు. అదే ఏ మూడేళ్ల తర్వాతో తయారైతే... అప్పటికి ఈ వైరస్ మరింత బలపడే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే... ఆ వ్యాక్సిన్ దీన్ని చంపలేదు. అందుకే వ్యాక్సిన్ తయారీ త్వరగా జరగాలి.
వ్యాక్సిన్ వచ్చేవరకూ ప్రపంచ దేశాలు ఇలా ముడుచుకుపోక తప్పదు. సరిహద్దులూ అంతే. విమానాలు, రైళ్లు, స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు, కంపెనీలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు ఏవీ తెరవడానికి ఛాన్స్ ఉండదు. ప్రజలు కూడా ఫ్రీగా బయట తిరిగే ఛాన్స్ ఉండదు. ఇళ్లలో బోర్ కొట్టి బయటకు వస్తే... అది చాలు కరోనా మరింత ప్రబలడానికి. కాబట్టి... ఒకరకంగా ప్రపంచ మానవాళికి ఇదో జైలు జీవితం లాంటిదే.ఏళ్ల తరబడి ఇలాగే బతకాలంటే... వైరస్ నుంచి తప్పించుకోవడం పెద్ద సవాలు. అలాగే... ప్రపంచ దేశాలన్నీ పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు, ఐసీయూలూ, ఐసోలేషన్లు, క్వారంటైన్లూ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇండియానే తీసుకుంటే... ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తామంటోంది కేంద్రం. కానీ... అది ప్రమాదకరం అవ్వొచ్చంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే... చైనా 2 నెలలపాటూ లాక్‌డౌన్ ఉంచి... మొన్ననే సడలించింది. తీరా సడలించాక... మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అంటే మళ్లీ వైరస్ విచ్చలవడిగా వ్యాపించడం మొదలైనట్లే. చైనాలోనే అలా ఉంటే... మరి అంతకంటే తక్కువ అభివృద్ధి చెందిన దేశం భారత్. ఇక్కడెలా వైరస్ కంట్రోల్ అవుతుంది? ఈ ప్రశ్న డాక్టర్లను భయరపెడుతోంది.
ఎక్కడైనా సరే... లాక్‌డౌన్ అనేది మాగ్జిమం 6 నెలలు దాటితే ప్రమాదమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రపంచంలో కరోనా వైరస్ ఎక్కడున్నా... అది ప్రపంచ దేశాలన్నింటికీ ప్రమాదమే. కాబట్టి... ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కరోనా టెస్టులు జరపడమే సరైన నిర్ణయం అంటున్నారు. టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉన్న వారిని... లక్షణాలు లేని వారినీ వేర్వేరు చెయ్యడం ద్వారా... వైరస్ వారికి చేరకుండా చెయ్యొచ్చు. అలాగే లక్షణాలు ఉన్నవారికి సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా వారికి నయం చెయ్యొచ్చు. ఏం చేసినా... పూర్తిగా వైరస్ వదిలిపోవాలంటే, అలాంటి కాన్ఫిడెన్స్ మనలో కలగాలంటే... వ్యాక్సిన్ తయారవ్వాల్సిందే.
సాధారణంగా ఓ వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి ఫార్మా కంపెనీలు కొన్నేళ్లపాటూ టైమ్ తీసుకుంటాయి. ఎన్నో రకాల టెస్టులు చేస్తాయి. అన్నింట్లోనూ సక్సెస్ అయితేనే వ్యాక్సిన్ అమల్లోకి వస్తుంది. అందువల్ల ఎంత త్వరగా చెయ్యాలన్నా కనీసం సంవత్సరం టైమ్ పడుతుంది. అందులో 6 నెలల పాటూ ప్రయోగ పరీక్షలు చేస్తారు. మిగతా 6 నెల్లో వ్యాక్సిన్ అనుమతులు, తయారీ, ఎక్స్‌పోర్ట్, షిప్పింగ్ వంటివి చేపడతారు. అందువల్ల ఇప్పుడు వైరస్ వ్యాపించే వేగం, వ్యాక్సిన్ తయారీపై జరుగుతున్న ప్రయోగాల్ని లెక్కలోకి తీసుకుంటే... కనీసం ఏడాది పాటూ... ఇవే పరిస్థితులు కొనసాగే ప్రమాదం ఉందంటున్నారు. ప్రజలు కూడా మానసికంగా అందుకు సిద్ధపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

0 Comments:
Post a Comment