బీజింగ్, ఏప్రిల్ 3: వూహాన్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోందా? కొవిడ్ పుట్టిల్లు.. మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులేస్తోందా? అంతా సద్దుమణిగి.. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనుకుంటున్నంతలోనే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న కేసులు ప్రజల్లో ఈ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నగరంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని, అత్యవసరమైతే తప్ప.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని శుక్రవారం అధికారులు చేసిన ప్రకటన వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 8 నుంచి వూహాన్‌లో రైళ్లు, విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో
అధికారులు ఈ ప్రకటన చేయడంతో అంతటా అయోమయం నెలకొంది. బుధవారం నుంచి వూహాన్‌లో అనూహ్యంగా.. లక్షణాలు కనిపించని కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనాభా మొత్తానికీ పరీక్షలు చేయించాలని అక్కడి ప్రభు త్వం భావిస్తోంది. కాగా, కరోనా వైరస్‌పై పోరాటం చేసి అమరులైన తమ దేశ వైద్యులకు, సిబ్బందికి 4న నివాళి అర్పించాలని చైనా నిర్ణయించింది.

0 Comments:
Post a Comment