ఆంధ్రప్రదేశ్‌లో దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు వస్తుందంటూ జరిగిన ప్రచారంపై మీసేవ స్పందించింది. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు వస్తుందంటూ ప్రచారం జరగడంతో రేషన్ కార్డులు లేని వారు పెద్ద ఎత్తున మీసేవ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో ఈ ప్రచారం అంతా ఫేక్ అంటూ మీ సేవ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటన జారీ చేశారు. కొన్ని సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్నట్టు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డులు రావంటూ క్లారిటీ ఇచ్చింది. అది కేవలం ఫేక్ న్యూస్ అని ప్రచారం స్పష్టం చేసింది. కొత్త రేషన్ కార్డులు అప్లే చేసుకునే విధానం మీసేవలో లేదని ఆ సంస్థ డైరెక్టర్ తేల్చి చెప్పారు.
కొత్త రేషన్ కార్డులు కావాలంటే కేవలం గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పౌర సరఫరాల శాఖ చెప్పినట్టు స్పందన కార్యక్రమం ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులను పొందవచ్చని తెలిపారు. కాబట్టి, ఐదు రోజుల్లో మీసేవ ద్వారా రేషన్ కార్డు వస్తుందనే ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment