అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం రెడ్ జోన్ లో ఉందనే పుకార్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఖండించారు. జగన్ నివాసం ఉన్న తాడేపల్లి రెడ్ జోన్ లో లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన సూచించారు. నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించామని, తాడేపల్లిలో ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ నుంచి ఊరట లభించడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 31 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభించింది.

0 Comments:
Post a Comment