అమరావతి : ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా మర్కజ్ ఘటన తర్వాత కర్నూలు జిల్లాలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు వెల్లడించారు.
దీనిపై ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. అది వాస్తవమేనని పేర్కొన్నారు. 'నా కుటుంబంలో ఆరు మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందరు ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాక్‌డౌన్ అంతగా ఉపయోగపడటం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకుతోంది. మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీతో కరోనా కట్టడి అవుతుంది' అని మీడియాకు ఎంపీ వెల్లడించారు.
0 Comments:
Post a Comment